CM Revanth Reddy: రెండో రాజధానిగా వరంగల్.. ఫుల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్.. ఈ 28న సమీక్ష

| Edited By: Balaraju Goud

Jun 25, 2024 | 8:21 AM

వరంగల్‌లో జూన్ 28వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నగర అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై సమీక్ష చేస్తారు. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలపై చర్చించనున్నారు.

CM Revanth Reddy: రెండో రాజధానిగా వరంగల్.. ఫుల్ ఫోకస్ చేసిన సీఎం రేవంత్.. ఈ 28న సమీక్ష
Cm Revanth Reddy
Follow us on

వరంగల్ మహానగరంపై స్పెషల్ ఫోకస్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్ మహానగరంతోపాటు వరంగల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. హైదరాబాద్ తర్వాత రెండో రాజధానిగా అన్ని అర్హతలున్న వరంగల్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్డు తోపాటు, ఎయిర్ పోర్టు నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో వరంగల్ సమగ్రాభివృద్ధి కోసం సమీక్ష నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే వరంగల్‌లో జూన్ 28వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నగర అభివృద్ధి పనులపై హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించనున్నారు. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ పరిధిలో చేపట్టబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై సమీక్ష చేస్తారు. అలాగే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులతో సమావేశం అవుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరంగల్‌లోనే గడపునున్నారు సీఎం రేవంత్ రెడ్డి.

వరంగల్ సమీక్ష సమావేశానికి కావలసిన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే ఆదేశించింది. అండర్ డ్రైనేజీ పనులు, ఎంజీఎం హాస్పిటల్ అభివృద్ధి, నూతనంగా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులతోపాటు కూడా పరిధిలో ఉన్న పెండింగ్ పనులపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఉత్తర తెలంగాణ అంతా వరంగల్ వైపు చూసేలా నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..