
రేవంత్ రెడ్డికి తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసు? ఆయనలో ఆత్మ లేదు.. తెలంగాణ అంటే గౌరవం కూడా లేదు.. అని బీఆర్‌ఎస్ లీడర్ కేటీఆర్ కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. దీనికి సీఎం రేవంత్ నుంచి ఘాటు స్పందనే వచ్చింది. మహబూబ్‌నగర్ సాక్షిగా ఆయన ఘాటు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అంటే పోరాటాల పురిటిగడ్డ.. ఎంతోమంది ఉద్యమకారులు రాష్ట్రం కోసం అసువులు బాసారు. ఇక్కడి మట్టిలోనే ఆత్మగౌరవం ఉంటుంది.. ఇప్పుడు అదే ఆత్మగౌరవ నినాదం రాజకీయంగా మారుతోంది. సీఎం రేవంత్ రెడ్డి విధానాలను తప్పుబడుతూ.. మాజీ పాలకులు మండిపడుతున్నారు. ప్రధాని మోదీ టూర్‌లో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై విమర్శలు గుప్పిస్తోంది గులాబీ పార్టీ. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఘాటుగానే ట్వీట్స్ చేశారు. వీరిద్దరి కెమిస్ట్రీపై సెటైర్లు వేశారు కేటీఆర్. ప్రజల సాక్షిగా.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ సాక్షిగా రేవంత్ దాడి చేశారంటూ ఘాటు కామెంట్ చేశారు. రేవంత్‌కు తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెలియదన్నారు. రేవంత్‌కు తెలంగాణ ఆత్మలేదు.. రాష్ట్రంపై గౌరవం అంతకన్నా లేదని మండిపడ్డారు. అంతేకాదు.. మోదీ కాళ్లదగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టన రేవంత్ లాంటి వాళ్లు సీఎం కావడం ప్రజల ఖర్మ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్..
దీనికి సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. దేశ ప్రధానిగా మోదీకి గౌరవం ఇచ్చానేగానే.. గదిలోకి వెళ్లి కాళ్లు పట్టుకోలేదని ఆయన మండిపడ్డారు. ఆత్మ విశ్వాసంతో మోదీ ముందు మాట్లాడానని.. మన సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లానన్నారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వాల్సిందేనని.. లేకుంటే.. మోదీకి చాకిరేవు పెడతానంటూ.. అటు బీఆర్‌ఎస్, ఇటు బీజేపీకి ఒకేసారి పంచ్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి..
గత ప్రభుత్వం కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగించలేదని అందుకే రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడిందని ఇప్పటికే కాషాయదళం విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మోదీ రావడంతో.. ఆయనను పెద్దన్న అంటూ రేవంత్ సంబోధించడం.. బీఆర్‌ఎస్‌కు కొత్త ఆయుధాన్నిచ్చింది. ఆయన షిండే అవుతారని ఓవైపు.. ఆయనలో తెలంగాణ ఆత్మగౌరవమే లేదని మరోవైపు ముప్పేట దాడి మొదలు పెట్టారు. నిన్న మహబూబ్‌నగర్ సభలో రేవంత్ ఇచ్చిన కౌంటర్‌కు ఇప్పుడు ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..