CM Revanth Reddy: ఎవరిమీద సమరం.. మీకు బాధ్యత లేదా? ఉద్యోగ సంఘ నేతలపై రేవంత్ సీరియస్‌..!

ఉద్యోగ సంఘాల నేతల వార్నింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌ అయ్యారు. తమ డిమాండ్ల కోసం సమ్మెకు దిగుతామన్న ఉద్యోగలను ఉద్దేశించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదని, అణాపైసా అప్పు పుట్టడంలేదన్నారు. బ్యాంకుల దగ్గరకు వెళితే దొంగలను చూసినట్టు చూస్తున్నారన్నారు. ఏ సంక్షేమ పథకాలు ఆపి ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలో సంఘాల నేతలు చెప్పాలని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Revanth Reddy: ఎవరిమీద సమరం.. మీకు బాధ్యత లేదా? ఉద్యోగ సంఘ నేతలపై రేవంత్ సీరియస్‌..!
Cm Revanth Reddy

Updated on: May 05, 2025 | 6:34 PM

ఉద్యోగ సంఘాల నేతల వార్నింగ్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్‌ అయ్యారు. తమ డిమాండ్ల కోసం సమ్మెకు దిగుతామన్న ఉద్యోగలను ఉద్దేశించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదని, అణాపైసా అప్పు పుట్టడంలేదన్నారు. బ్యాంకుల దగ్గరకు వెళితే దొంగలను చూసినట్టు చూస్తున్నారన్నారు. ఏ సంక్షేమ పథకాలు ఆపి ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలో సంఘాల నేతలు చెప్పాలని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వంపై సమరమే అంటూ ఉద్యోగ సంఘాలు ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకు సమరం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. తనను కోసినా సరే.. వచ్చిన ఆదాయానికి మించి ఖర్చు చేయలేనని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాల నాయకుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ప్రభుత్వం అంటే ప్రజా ప్రతినిధులు ఒక్కరమే కాదని.. ఉద్యోగులు కూడా భాగమే అన్న విషయం మర్చిపోతున్నారన్నారు. మనం పాలకులం కాదు.. సేవకులంగా ప్రజల కోసం పనిచేయాలన్నారు. కొన్ని రాజకీయ పార్టీల చేతుల్లో చిక్కి ప్రభుత్వంపైనే ఉద్యోగులు సమరానికి దిగడం సరికాదన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే సహకరించాల్సిన ఉద్యోగ సంఘాలే సమరం అంటున్నారని సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలకు లేదా అన్న సీఎం, ఏదైనా సమస్య ఉంటే చర్చించుకోవడానికి ముందుకు రావాలని రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలకు విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని రాజకీయ పార్టీలు కుట్ర చేస్తున్నాయన్న ముఖ్యమంత్రి. వారి కుట్రలో ఉద్యోగ సంఘాలు భాగం కారాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిరసనలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థికస్థితి దృష్ట్యా అప్పులు పుడితేనే ఏదైనా చేయొచ్చన్న సీఎం.. కానీ, ఎక్కడా అప్పు పుట్టట్లేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ నియంత్రణే పరిష్కారమన్నారు. ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబం పరువును బజారున పడేయొద్దన్నారు. సమయస్ఫూర్తి, సంయమనంతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించేందుకు కలిసి పనిచేద్దామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..