Revanth Reddy: అవి అవసరమా..? ఇష్టం లేని అధికారులు బాధ్యతల నుంచి తప్పుకోవచ్చు.. సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..

తెలంగాణలో డ్రగ్స్‌, భూ కబ్జాలు అనే మాట వినపడకూడదన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అబ్యూజ్‌ చేస్తే ఊరుకోబోమన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమంటూ ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు వార్నింగ్‌ ఇచ్చారు. ఇష్టం లేని అధికారులు బాధ్యతల నుంచి తప్పుకోవచ్చన్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో తొలి మీటింగ్‌లో తన మార్క్‌ ఏంటో రుచి చూపించారు రేవంత్‌.

Revanth Reddy: అవి అవసరమా..? ఇష్టం లేని అధికారులు బాధ్యతల నుంచి తప్పుకోవచ్చు.. సీఎం రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్..
Cm Revanth Reddy

Updated on: Dec 25, 2023 | 8:22 AM

రాజకీయాల్లోనే కాదు.. పరిపాలనలో కూడా తనదైన మార్కు, మార్పు చూపిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి. ఆయన దూకుడుగా దూసుకెళ్తున్నారు. తెలంగాణలో డ్రగ్స్‌, భూ కబ్జాలు అనే మాట వినపడకూడదంటూ కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్‌. అధికారులు అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించబోమంటూ వార్నింగ్‌ ఇచ్చారు. గోవా, మహారాష్ట్ర, కర్నాటక లాంటి స్టేట్స్‌.. సన్‌బర్న్‌ ఈవెంట్లను కేన్సిల్‌ చేస్తే తెలంగాణలో అవి అవసరమా అన్నారు రేవంత్‌.. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి తొలిసారి కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమయ్యారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు. నకిలీ విత్తనాల దందా టెర్రరిజం కంటే డేంజర్ అన్నారు సీఎం. నకిలీ విత్తనాల దందాపై అధికారులు ఉక్కుపాదం మోపాలని ఆదేశాలు జారీ చేశారు.

తమ ప్రభుత్వం చాలా ఓపెన్ మైండ్‌తో ఉందన్నారు సీఎం రేవంత్‌. అధికారులు ఇచ్చే సలహాలు, సూచనలు ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అలాగే, ప్రతీ ఒక్కరూ పని చేయాల్సిందే అని ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తప్పుకోవచ్చంటూ అధికారులను హెచ్చరించారు. పని విషయంలో ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇదే క్రమంలో అక్రమార్కులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చను ఇస్తున్నట్టు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను అబ్యూజ్‌ చేస్తే ఊరుకోబోమన్నారు. ఇక ఆరు గ్యారంటీల అమలుపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు సీఎం రేవంత్‌.

మొదటి మీటింగ్‌లోనే తన మార్క్‌ ఏంటో అధికారులకు రుచి చూపించారు సీఎం రేవంత్‌ రెడ్డి. తమ సర్కార్‌ అధికారులతో ఫ్రెండ్లీగా ఉంటూనే, తప్పు చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ తన పరిపాలన ఎలా ఉండబోతోందో టీజర్‌ చూపించారు సీఎం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..