Revanth Reddy: 5 సీట్లకు వారి మధ్య ఒప్పందం కుదిరింది.. బీజేపీ- బీఆర్ఎస్‌పై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

బీజేపీ- బీఆర్ఎస్ మధ్య ఒప్పందం బయటపడింది.. ఈటల రాజేందర్ గెలుస్తారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలే దీనికి అద్దం పడుతున్నాయి.. బీజేపీ గెలుస్తుందన్న మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.. 5 సీట్లకు వారి మధ్య ఒప్పందం కుదిరింది.. అంటూ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీపై సంచలన ఆరోపణలుచేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలుచేశారు.

Revanth Reddy: 5 సీట్లకు వారి మధ్య ఒప్పందం కుదిరింది.. బీజేపీ- బీఆర్ఎస్‌పై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
KCR - Revanth Reddy
Follow us

|

Updated on: Apr 27, 2024 | 7:47 PM

బీజేపీ- బీఆర్ఎస్ మధ్య ఒప్పందం బయటపడింది.. ఈటల రాజేందర్ గెలుస్తారన్న మల్లారెడ్డి వ్యాఖ్యలే దీనికి అద్దం పడుతున్నాయి.. బీజేపీ గెలుస్తుందన్న మల్లారెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు.. 5 సీట్లకు వారి మధ్య ఒప్పందం కుదిరింది.. అంటూ మరోసారి సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్, బీజేపీపై సంచలన ఆరోపణలుచేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలుచేశారు. ఒప్పందంలో భాగంగానే ఈటలను గెలిపించడానికి సిద్దమయ్యారని.. రాజ్యాంగం మార్చాలన్న కేసీఆర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీ అజెండానే అంటూ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసమే.. ఈటలకు వ్యతిరేకంగా కేసీఆర్‌ ఎక్కడా మాట్లాడలేదన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌ ఒక్కటే అనడానికి.. మల్లారెడ్డి, ఈటల సంభాషణే నిదర్శనమన్నారు. బీజేపీతో చీకటి ఒప్పందం లేకపోతే..మీ మేడ్చల్‌ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలంటూ రేవంత్ రెడ్డి సవాల్ చేశారు.

జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ సాక్షిగా అంటూ రేవంత్ మరో ఒట్టు వేశారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరతాన్నారు. భూములు అమ్మకుండా రుణమాఫీ చెయ్యమని ఈటల సలహా ఇస్తున్నారు.. ఇదే మాట గతంలో కేసీఆర్, కేటీఆర్‌లకు ఎందుకు చెప్పలేదన్నారు. భూములు వాళ్లు వాళ్లే అమ్ముకుంటారా..? అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు.

రిజర్వేషన్లు రద్దు చేయాలని కుట్ర చేస్తున్నారు.. రాజ్యాంగాన్ని మార్చబోతున్నారు..అంటూ రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. 100 ఏళ్లలో భారత్‌ను హిందూ దేశంగా మార్చాలని..1925లోనే ఆర్ఎస్‌ఎస్‌ ప్రతిజ్ఞ చేసిందన్నారు. ఆ కుట్రలో భాగంగానే 2025లో భారత్‌ను పూర్తి హిందూ దేశంగా మార్చబోతున్నారంటూ పేర్కొన్నారు.

మోదీ, అమిత్‌షా అన్ని వ్యవస్థలను వాడుకుంటున్నారు.. దేశ జనాభాను దృష్టిలో పెట్టుకుని.. ఆనాడు కాంగ్రెస్ రిజర్వేషన్లు నిర్ణయించిందన్నారు.. రేవంత్ రెడ్డి.. RSS అనుకూల వర్గాలు రిజర్వేషన్లను వ్యతిరేకించాయి.. ఉన్నత వర్గాలకు అండగా నిలబడ్డాయి.. సుప్రీంకోర్టు ఆమోదంతోనే బీసీ, ఓబీసీ రిజర్వేషన్లు అమలుచేస్తున్నట్లు తెలిపారు.

కరెంట్ కోతలపై..

కరెంట్ కోతలపై కేసీఆర్‌ చేసిన ట్వీట్‌పై రేవంత్ రెడ్డి స్పందించారు.. లేనిపోని అబద్ధాలతో కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారు. మొన్న సూర్యాపేటలో కరెంట్‌ పోయిందని అబద్దం చెప్పారు.. ఇప్పుడు మహబూబ్‌నగర్‌లోనూ అవే అబద్ధాలు చెబుతున్నారు. కేసీఆర్‌కి మరీ ఇంత అధికార దాహం ఎందుకు.. అంటూ సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles