Khammam: ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓట్లు ఎవరికి..? ఆసక్తిగా మారిన రాజకీయం

ఖమ్మం గుమ్మంలో ఏ పార్టీకి టీడీపీ మద్దతు ఇస్తుంది? ఎంపీ ఎన్నికల్లో వాళ్ల ఓటు ఎటువైపు? కాంగ్రెస్‌ అభ్యర్థికి చెయ్యెత్తి జై కొడతారా? కులాల కూడికలు తీసివేతలు చేసి కారెక్కుతారా? లేక ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీతో కలిసి వెళతారా?.. ఇంట్రస్టింగ్ డీటేల్స్.....

Khammam: ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓట్లు ఎవరికి..? ఆసక్తిగా మారిన రాజకీయం
Khammam TDP
Follow us

|

Updated on: May 10, 2024 | 7:28 AM

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకప్పుడు టీడీపీ బలంగా ఉండేది. కొద్ది నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో కూడా ఆ పార్టీ తెలంగాణ నుంచి అభ్యర్థులను నిలబెట్టలేదు. అయితే ఖమ్మం జిల్లాలో టీడీపీని అభిమానించేవాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లంతా కాంగ్రెస్‌కు ఓటేశారు. అయితే ఈసారి టీడీపీ మద్దతుదారుల ఓట్లు ఏ పార్టీకి అనేది రాజకీయ చర్చకు దారితీస్తోంది. పార్లమెంటు ఎన్నికల వేళ ఖమ్మం జిల్లాలో టీడీపీ మూడు వర్గాలుగా విడిపోయింది. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాం కదా…ఈసారి కూడా కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి రఘురామిరెడ్డికి ఓటు వేద్దామని ఓ వర్గం వాదిస్తోంది. కాస్ట్ ఈక్వేషన్స్‌లో భాగంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు మద్దతు ఇవ్వాలని మరో వర్గం పట్టు పడుతోంది. ఇక ఏపీలో బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి వినోద్‌ రావుకు ఓటు వేయాలని మరికొందరు సూచిస్తున్నారు. ఇలా ఖమ్మం టీడీపీ మూడు పాయలుగా చీలిపోయింది.

ఈ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలంటూ మూడు పార్టీల అభ్యర్థులు టీడీపీ ఆఫీసు గడప తొక్కారు. అయితే చంద్రబాబు ఆదేశాల మేరకు బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు ఒక వర్గం ప్రకటించడమే కాకుండా…కాషాయ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఇక తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో సమావేశం అయి..కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్లు మరో వర్గం ప్రకటించింది. కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినందుకు టీడీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు పొంగులేటి.

ఇలా ఖమ్మం గుమ్మంలో టీడీపీ మద్దతుదారులు…మూడు దారుల్లో పయనిస్తున్నారు. పార్టీ మూడు పాయలుగా చీలిపోయింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles