‘కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా’.. బండి సంజయ్..

హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా? అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. 20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను కించపరుస్తారా? అని కేటీఆర్‎ను నిలదీశారు. హిందువులారా.. మీ సత్తా ఏందో కేసీఆర్‎కు మళ్లీ రుచి చూపించండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

'కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా'.. బండి సంజయ్..
Bandi Sanjay
Follow us

|

Updated on: May 10, 2024 | 1:46 PM

హిందువుల ఓట్లు నీకు అక్కర్లేదా? అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. 20 శాతం ఓట్ల కోసం 80 శాతం హిందువులను కించపరుస్తారా? అని కేటీఆర్‎ను నిలదీశారు. హిందువులారా.. మీ సత్తా ఏందో కేసీఆర్‎కు మళ్లీ రుచి చూపించండంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, వినోద్ ఓడిపోతే బీఆర్ఎస్‎ను మూసేసి రాజకీయ సన్యాసం చేస్తారా అని కేసీఆర్‎కు సవాల్ విసిరారు. తన వెనుక 80 శాతం హిందువులున్నారన్నారు. బీజేపీని భారీ మెజారిటీతో గెలిపించి కేసీఆర్‎కు బుద్ది చెప్పండని పిలుపునిచ్చారు. కేటీఆర్ నోటి నుండి జై శ్రీరాం మాటే రాదని.. కరీంనగర్ వేదికగా మత చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఓట్ల కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన సైనికులనే అవమానిస్తారా అని ప్రశ్నించారు.

కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే లేరని ధ్వజమెత్తారు. తెలంగాణకు కేంద్రం రూ.10 లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. చర్చకు సిద్ధమైతే.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్‎ ఏర్పాటు చేసి ఆధారాలు చూపిస్తామన్నారు. వీటన్నింటిపై ప్రశ్నిస్తుంటే.. తనను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వందల కోట్లు ఖర్చు పెడుతున్నయని ఆరోపించారు. సిరిసిల్ల నేతన్నల చావులకు కారణం మీరు కాదా అని నిలదీశారు బండి సంజయ్. రైతులు పంట నష్టపోతే పరిహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం నుండి నిధులు తెచ్చే బాధ్యత తనదని.. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ