AC Current Bill: ఏసీతో కరెంట్‌ బిల్ వాచి పోతుందా.? ఈ టెంపరేచర్ సెట్ చేసుకోండి

దీంతో సహజంగానే కరెంట్‌ బిల్లు ఓ రేంజ్‌లో వస్తుంది. ఏసీ ఆన్‌ చేసుకున్నంత సేపు ఎంత చల్లగా ఉంటుందో. కరెంట్‌ బిల్లు రాగానే అమౌంట్‌ చూసి చమటలు పట్టే పరిస్థితి వస్తోంది. అయితే సమ్మర్‌లో ఏసీని ఉపయోగించినా కరెఉంట్‌ బిల్లు తక్కువగా రావాలంటే ఏం చేయాలో తెలుసా.? ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏసీ ఉపయోగిస్తున్నా కరెంట్ బిల్లు తక్కువ...

AC Current Bill: ఏసీతో కరెంట్‌ బిల్ వాచి పోతుందా.? ఈ టెంపరేచర్ సెట్ చేసుకోండి
Ac Using
Follow us

|

Updated on: May 10, 2024 | 2:12 PM

ఎండలు దంచికొడుతున్నాయి. అయితే ఈ మధ్య రెండు మూడు రోజుల నుంచి సాయంత్రం కాస్త వాతావరణం చల్లబడినా ఉదయం మాత్రం భానుడి ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు. దీంతో చాలా మంది ఇంటికే పరిమితం అవుతున్నారు. ఎండల నుంచి తప్పించుకోవడానికి ఇంట్లో ఏసీలను ఆశ్రయిస్తున్నారు. సాధారణంగా ఏసీలతో కరెంట్‌ బిల్లులు వాచిపోతున్నాయని తెలిసిందే. ఇక సమ్మర్‌లో ఏసీ వాడకం ఎలా ఉంటుదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దీంతో సహజంగానే కరెంట్‌ బిల్లు ఓ రేంజ్‌లో వస్తుంది. ఏసీ ఆన్‌ చేసుకున్నంత సేపు ఎంత చల్లగా ఉంటుందో. కరెంట్‌ బిల్లు రాగానే అమౌంట్‌ చూసి చమటలు పట్టే పరిస్థితి వస్తోంది. అయితే సమ్మర్‌లో ఏసీని ఉపయోగించినా కరెఉంట్‌ బిల్లు తక్కువగా రావాలంటే ఏం చేయాలో తెలుసా.? ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏసీ ఉపయోగిస్తున్నా కరెంట్ బిల్లు తక్కువ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఏసీలో టెంపరచేర్‌ సెట్ చేసుకునే విధానం ద్వారా కరెంట్ బిల్లు తక్కువగా వచ్చేలా చేసుకోవచ్చని మీకు తెలుసా.? ఏసీని 24 డిగ్రీల సెల్సియస్‌ వద్ద సెట్‌ చేయడం వల్ల కరెంట్‌ బిల్లు ఎక్కువ రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 24 డిగ్రీల సెల్సియస్‌ నుంచి మీరు ఒక్కో డిగ్రీ టెంపరేచర్‌ తగ్గిస్తే కరెంట్‌ బిల్లు కూడా పెరుగుతుందని అంటున్నారు. కాబట్టి, ఏసీని ఎల్లప్పుడూ ఈ టెంపరేచర్ వద్ద సెట్‌ చేసుకుంటే కరెంట్ బిల్లు తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి.

మరీ ముఖ్యంగా ఏసీ టెంపరేచర్‌ను 23.5 డిగ్రీల నుంచి 25.5 డిగ్రీల వరకు సెట్ చేసుకుంటే కరెంట్ బిల్లు తక్కువగా వస్తుందని చెబుతున్నారు. ఇక ఏసీని ఈ టెంపరేచర్‌ దగ్గర పెట్టుకొని సీలింగ్ ఫ్యాన్‌ ఆన్‌ చేసుకుంటే ఏసీ గది మొత్తం వ్యాపిస్తుంది. ఇక కొందరు త్వరగా చల్లగా మారాలన్న ఉద్దేశంతో 18 డిగ్రీల కంటే తక్కువగా సెట్ చేస్తారు. అయితే దీనివల్ల కరెంట్ బిల్లు ఎక్కువగా వస్తుంది. అందుకే గదిలోకి వెళ్లే కాసేపు ముందే ఆన్‌ చేసుకుంటే మీరు వెళ్‌లే సమయానికి గది కూల్‌గా మారుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ