Hyderabad: అమ్మాయి పరిచయమై.. కలుద్దాం అంది.. ఆశపడిన యువకుడికి నిరాశ..

విలాసాలకు అలవాటయ్యారు. ఈజీ మనీ లేనిదే పని కాదు. అందుకోసం అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సిటీలో ఓ యువకుడిని నిట్ట నిలువునా ముంచేశాడు. డేటింగ్ యాప్‌ ద్వారా మాయ చేసి అతడిని దోచేశారు. యువకుడిని భయపెట్టి.. నిమిషాల వ్యవధిలో 60 వేలు గుంజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Hyderabad: అమ్మాయి పరిచయమై.. కలుద్దాం అంది.. ఆశపడిన యువకుడికి నిరాశ..
Dating App
Follow us

| Edited By: Srikar T

Updated on: May 10, 2024 | 1:42 PM

విలాసాలకు అలవాటయ్యారు. ఈజీ మనీ లేనిదే పని కాదు. అందుకోసం అమాయకులను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా సిటీలో ఓ యువకుడిని నిట్ట నిలువునా ముంచేశాడు. డేటింగ్ యాప్‌ ద్వారా మాయ చేసి అతడిని దోచేశారు. యువకుడిని భయపెట్టి.. నిమిషాల వ్యవధిలో 60 వేలు గుంజేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగర్‌ కాలనీకి చెందిన అజిత్‌ కె ఇమ్మాన్యుయెల్‌ అనే వ్యక్తి.. మే 6న డేటింగ్ యాప్‌లో ఓ అమ్మాయితో చాట్ చేశాడు. మాటల్లో ఈ రోజే కలుద్దామనుకున్నారు. ఆ రోజే సాయంత్రం యువతిని కలిసేందుకు గోల్కొండ ఏరియాకు కారులో వెళ్లాడు అజిత్. అక్కడ కాసేపు ఉన్నాక.. మరో ప్రాంతానికి వెళ్దామనుకున్నారు. ఇంతలో సీన్‌లోకి ముగ్గురు వ్యక్తలు ఎంట్రీ ఇచ్చి కారును అడ్డుకున్నారు. ఈ క్రమంలో యువతి మెల్లిగా అక్కడ నుంచి ఎస్కేప్ అయింది.

‘మీరు వ్యభిచారం చేయడానికి వచ్చారు.. మా దగ్గర సమాచారం ఉంది.’ అంటూ అజిత్‌ను ఆ ముగ్గురు బెదిరించారు. పోలీసుల వద్దకు తీసుకెళ్తామని.. కేసులు నమోదు చేయిస్తామని, మీడియాకు చెప్పి పరువు తీస్తామంటూ బెదిరింపులకు దిగారు. రూ.లక్ష ఇస్తే.. వదిలేసి వెళ్లిపోతామన్నారు. తేడా వస్తే.. తనకు ఇబ్బంది అవుతుందని భయపడ్డ అజిత్ తన ఖాతాలో ఉన్న రూ.60వేలను వారి వద్ద ఉన్న క్యూఆర్‌ కోడ్‌కు స్కాన్‌ చేసి బదిలీ చేశాడు. ఆ తర్వాత దుండగలు.. అజిత్ కారులోనే మణికొండ వైపు వెళ్లి.. రోడ్డు పక్కన కారు ఆపి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యారు. ఆ తర్వాత బాధితుడు ఫిల్మ్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జరిగింది చెప్పాడు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. డేటింగ్ యాప్‌ల పట్ల అలెర్ట్‌గా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని.. ముందే జాగ్రత్తగా ఉంటే మాయగాళ్ల ఉచ్చు నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్నారు.

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ