Vomiting While Brush: బ్రష్ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా.. ఈ వ్యాధులు ఉన్నట్లే!

ప్రతి రోజూ చేసే దినచర్యలో పళ్లు తోమడం కూడా ఒకటి. పళ్లు తోమడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగు పడటమే కాకుండా.. నోరంతా క్లీన్ అవుతుంది. చెడు బ్యాక్టీరియా బయటకు వెళ్తుంది. పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే పళ్లు తోమేటప్పుడు చాలా మందికి వికారంగా ఉండి, వాంతులు అవుతూ ఉంటాయి. వాంతులు చేసుకుంటే తప్ప వారికి రిలీఫ్‌గా ఉండదు. అయితే ఎందుకు ఇలా అవుతుందని పెద్దగా పట్టించుకోరు. ఇలా పళ్లు తోమేటప్పుడు..

Vomiting While Brush: బ్రష్ చేసేటప్పుడు వాంతులు అవుతున్నాయా.. ఈ వ్యాధులు ఉన్నట్లే!
Vomiting While Brush
Follow us

|

Updated on: May 10, 2024 | 2:25 PM

ప్రతి రోజూ చేసే దినచర్యలో పళ్లు తోమడం కూడా ఒకటి. పళ్లు తోమడం వల్ల నోటి ఆరోగ్యం మెరుగు పడటమే కాకుండా.. నోరంతా క్లీన్ అవుతుంది. చెడు బ్యాక్టీరియా బయటకు వెళ్తుంది. పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అయితే పళ్లు తోమేటప్పుడు చాలా మందికి వికారంగా ఉండి, వాంతులు అవుతూ ఉంటాయి. వాంతులు చేసుకుంటే తప్ప వారికి రిలీఫ్‌గా ఉండదు. అయితే ఎందుకు ఇలా అవుతుందని పెద్దగా పట్టించుకోరు. ఇలా పళ్లు తోమేటప్పుడు వాంతులు అవ్వడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అల్సర్:

చాలా మందికి అల్సర్ ఉంటుంది. కొంత మంది ఉన్నా పట్టించుకోరు. ఇంకెంత మందికి అల్సర్ ఉందన్న విషయం కూడా తెలీదు. మీకు అల్సర్ సమస్య ఉంటే.. పళ్లు తోమేటప్పుడు వాంతులు అవుతాయి. ఇలా తరచూ మీరు వాంతులు చేస్తుంటే.. ఖచ్చితంగా వైద్యుల్ని కలవడం మంచిది.

మూత్ర పిండాల వ్యాధి:

మూత్ర పిండాల వ్యాధి ఉన్నప్పుడు కూడా చాలా మందికి ఈ సమస్య అనిపిస్తుంది. ప్రస్తుత కాలంలో చాలా మంది మూత్ర పిండాల వ్యాధితో బాధ పడుతున్నారు. శరీరంలో మూత్ర పిండాలు పని చేయకపోతే.. కడుపుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దీని వల్ల ఉదయం పళ్లు తోమేటప్పుడు వికారంగా వాంతులు అవుతూ ఉంటాయి. ఇలా వాంతులు చేసుకునే సమయంలో కడుపులో నొప్పిగా, పిండేసినట్లు కూడా ఉంటుంది. ఇలా అనిపించినప్పుడు ఆలస్యం చేయకుండా చెక్ చేయించుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

కాలేయ వ్యాధి:

కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నప్పుడు కూడా ఉదయం బ్రష్ చేసేటప్పుడు వికారంగా, వాంతులు అవుతూ ఉంటాయి. కాబట్టి దీన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు.

పిత్తం సమస్య:

బ్రష్ చేసేటప్పుడు వాంతులు అవడం, వికారం అనిపిస్తూ ఉంటే.. పిత్తం సమస్య కూడా కావచ్చు. శరీరంలో పిత్తం పెరగడం వల్ల.. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు పెరుగుతాయి. దీని వల్ల మీరు పళ్లు తోముకునేటప్పుడు వాంతులు అవుతూ ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
మీ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు బానిసలవుతున్నారా? ఇలా చేయండి
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
కేన్స్‌లో కన్నప్ప.. రెడ్ కార్పెట్‌పై మంచు ఫ్యామిలీ సందడి.. వీడియో
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
ప్రశాంతంగా ముగిసిన ఐదో విడత పోలింగ్.. ఆరో దశ ఎప్పుడంటే..
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జియో గుడ్‌న్యూస్‌..అతి తక్కువ ధరల్లోనే జియో 5జీ స్మార్ట్‌ ఫోన్‌
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
జోరు కొనసాగేనా? ఎలిమినేటర్ మ్యాచుల్లో ఆర్సీబీ గత రికార్డులు ఇవే
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
ఎల్‌టీఏ విషయంలో ఉద్యోగులకు షాక్..!
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ కేబినెట్ సంచలన నిర్ణయాలు ఇవే..
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
ఈపీఎఫ్ డెత్ క్లెయిమ్ చేసే వారికి అలెర్ట్.. ఆ కీలక నియమాల మార్పు
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కొత్తగా ట్రై చేయాలని స్మోకీ పాన్ తిన్న బాలిక.. కడుపులో రంధ్రం
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ
కల్కి ప్రమోషన్ల జోరు పెంచుదామా బుజ్జీ