మైండ్ బ్లాక్ అయ్యేలా జూనియర్ ఎన్టీఆర్ ఆస్తులు.. ఎంతంటే ??

Phani.ch

20 May 2024

టాలీవుడ్  యంగ్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. నందమూరి నట వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తాతకు తగ్గ మనవడిగా సత్తా చూపిస్తున్నాడు.

దాదాపు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 20 యేళ్ల పూర్తి చేసుకున్న ఎన్టీఆర్.  ఇన్నేళ్ల జూనియర్ ఎన్టీఆర్ సినీ  కెరీర్లో ఎంత సంపాదించారో తెలుసా ??

సినిమాల పరంగా జూనియర్ ఎన్టీఆర్ సంపాదంచిన ఆస్తులతో పాటు వారసత్వంగా వచ్చిన ఆస్తుల విలువ ఎన్ని వేల కోట్లో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.

చిన్నపుడు సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' హిందీ వెర్షన్ సినిమాలో బాల నటుడిగా భరతుడి పాత్రలో నటించారు. కానీ ఈ సినిమా రిలీజ్ కాలేదు.

తర్వాత బాల రామాయణం మూవీతో వెండితెరపై తెరంగేట్రం చేసాడు జూనియర్ ఎన్టీఆర్. ఆ తరువాత నిన్ను చూడాలిని మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మన యంగ్ టైగర్.

ఇక ఎన్టీఆర్ ఆస్తుల వివరాల్లోకి వెళ్తే జూబ్లీహిల్స్‌లోని ఇంటితో పాటు బెంగళూరులో రీసెంట్‌గా ఓ ఫామ్‌ హౌస్‌ను కొనుగోలు చేసినట్టు సమాచారం. వీటి విలువ దాదాపు రూ. 200 కోట్ల వరకు ఉండచ్చు.

అంతేకాదు వారసత్వంగా పరంగా కానీ మామ నార్నే శ్రీనివాస్ నుంచి సంక్రమించిన ఆస్తులతోపాటు దాదాపు రూ.1200 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.

 అంతేకాదు తాత ఎన్టీఆర్ నుంచి నిమ్మకూరులో కూడా పలు ఆస్తులు ఉండగా.. నాన్న హరికృష్ణ వారసత్వంగా సంక్రమించిన ఆస్తులు కలిపితే అక్కడ రూ. 15 కోట్ల వరకు ఉంటుందని అంచనా.