KADA: సొంత నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం ఫోకస్.. కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

|

Dec 30, 2023 | 3:25 PM

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న కొడంగల్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగు అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందులో భాగంగా కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

KADA: సొంత నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం ఫోకస్.. కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు
Kodangal Area Development Authority
Follow us on

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న కొడంగల్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగు అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రత్యేక కార్యాచరణను రూపొందించారు. ఇందులో భాగంగా కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి వెంటనే స్పెషల్ ఆఫీసర్‌ను నియమించాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.

గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో ఆయన సొంత నియోజకవర్గం గజ్వేల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పడింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రత్యేక అభివృద్ధి కోసం KADA ఏర్పాటు అయ్యింది. దీనికి వికారాబాద్ జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాల్లో మౌళిక వసతులు, విద్యా, ఆరోగ్య రంగాల్లో నిర్ధేశిత లక్ష్యాలను చేరుకోవడం, యువతకు ఉపాధి అవకాశాల కోసం స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు వంటి ప్రోగ్రామ్‌లను నిర్వహించనున్నారు. ఇందు కోసం ఇక్కడ ప్రత్యేకంగా చేపట్టనున్నారు.

అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతోనే కొడంగల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కొడంగల్ కేంద్రంగా KADA పని చేయనుంది. కొడంగల్, వికారాబాద్, నారాయణ్ పేట్ ప్రాంతాల అభివృద్ధి కోసం KADA ఏర్పాటు చేసిన ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో సైతం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ అంశాన్ని బలంగానే ప్రస్తావించడంతో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రణాళికలు వేగంగా కదలుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…