Revanth Reddy: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు.. ఏమని ట్వీట్ చేశారో తెలుసా..?

|

Jun 10, 2024 | 11:01 AM

తెలంగాణ, ఆంధ్రప్రేదశ్ నుంచి కేంద్ర కేబినెట్ బెర్త్ దక్కించుకున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమర్, కింజారపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి, రావాల్సిన నిధులపై శక్తివంచన లేకుండా కృషిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు.

Revanth Reddy: కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు.. ఏమని ట్వీట్ చేశారో తెలుసా..?
Revanth Reddy
Follow us on

తెలంగాణ, ఆంధ్రప్రేదశ్ నుంచి కేంద్ర కేబినెట్ బెర్త్ దక్కించుకున్న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమర్, కింజారపు రామ్మోహన్‌ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు భూపతిరాజు శ్రీనివాసవర్మకు సీఎం రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి, రావాల్సిన నిధులపై శక్తివంచన లేకుండా కృషిచేయాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరారు.

రేవంత్ రెడ్డి ట్వీట్..

‘‘తెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కె.రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు కృషి చేయాల్సిందిగా కోరుతున్నాను.’’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా.. మోదీ 3.0 క్యాబినెట్ లో తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలు.. ఏపీ నుంచి ఒక బీజేపీ ఎంపీ, పొత్తులో భాగంగా ఇద్దరు టీడీపీ ఎంపీలకు అవకాశం లభించింది. దీంతో కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

కిషన్‌ రెడ్డి, కింజారపు రామ్మోహన్‌ నాయుడు కు కేబినెట్ హోదా దక్కగా.. బండి సంజయ్ కుమర్ కు స్వతంత్ర హోదా, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ కు సహాయక మంత్రులుగా అవకాశం లభించింది. కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..