Dalita Bandhu: వాసాల‌మ‌ర్రి నుంచే ‘ద‌ళిత బంధు’, దళితుల అకౌంట్లలో రేపే 10 ల‌క్షల చొప్పున‌ జ‌మ‌.. సీఎం కేసీఆర్ ప్రకటన

|

Aug 04, 2021 | 6:44 PM

తెలంగాణ విపక్ష రాజకీయ పార్టీల్లో కల్లోలం సృష్టిస్తోన్న 'దళితబంధు' పథకం రేపటి నుంచే అమల్లోకి వచ్చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం

Dalita Bandhu: వాసాల‌మ‌ర్రి నుంచే ద‌ళిత బంధు, దళితుల అకౌంట్లలో రేపే 10 ల‌క్షల చొప్పున‌ జ‌మ‌.. సీఎం కేసీఆర్ ప్రకటన
Kcr Vasalamarri
Follow us on

CM KCR – Vasalamarri – DalitaBandhu: తెలంగాణ విపక్ష రాజకీయ పార్టీల్లో కల్లోలం సృష్టిస్తోన్న ‘దళితబంధు’ పథకం రేపటి నుంచే అమల్లోకి వచ్చేస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా వాసాలమర్రి నుంచే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. వాసాలమర్రిలోని దళితుల అకౌంట్లలో రేపు పది లక్షల రూపాయల చొప్పున నగదు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. మొత్తంగా వాసాలవర్రి గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకం మంజూరయింది. ఇవాళ వాసాలమర్రి గ్రామంలో పర్యటించి గ్రామ ప్రజలతో సీఎం కేసీఆర్ ముఖాముఖి నిర్వహించారు. తమ ప్రణాళిక ప్రకారం దళిత బంధు పథకం రెండేళ్ల నాడే ప్రారంభం కావాల్సి ఉందని చెప్పిన కేసీఆర్, కరోనా, లాక్ డౌన్ల నేపథ్యంలో ఈ కార్యక్రమం అమలులో జాప్యం జరిగిందని స్పష్టం చేశారు.

వాసాల‌మ‌ర్రి గ్రామానికి ద‌ళిత బంధు కోసం రూ. 7.60 కోట్లు త‌క్షణ‌మే మంజూరు చేస్తున్నాన‌ని సీఎం ప్రక‌టించారు. ద‌ళిత బంధు నిధుల‌ను ఒకే విడుత‌లో పంపిణీ చేస్తామ‌న్నారు. “ఈ ప్రపంచం మొత్తం మీద జ‌రిగిన కొన్ని దుర్మార్గాలు, ప‌నికిరాని విష‌యాల‌తో మ‌న దేశమే కాదు, యావ‌త్ ప్రపంచంలోని కొన్ని కోట్ల మంది బాధ‌లో ఉన్నారు. భార‌త్‌లో నిర్లక్ష్యానికి, అణ‌చివేత‌కు, వివ‌క్షకు గురైన‌ జాతి ద‌ళిత‌జాతి. అలాంటి ద‌ళితుల్లో ఐక‌మ‌త్యం రావాల్సిన అవ‌స‌రం ఉంది.” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఆలేరు నియోజ‌క‌వ‌ర్గంలో రూ. 30 కోట్లతో ద‌ళిత ర‌క్షణ నిధి ఏర్పాటు చేస్తామ‌ని ప్రక‌టించిన కేసీఆర్.. “వాసాలమర్రి ఊర్లో గ‌వ‌ర్నమెంట్ స్థలం 612 ఎక‌రాల భూమి ఉంది. ద‌ళితుల వ‌ద్ద చాలా త‌క్కువ స్థలం ఉంది. క‌బ్జా పెట్టిన భూముల‌పై విచార‌ణ జ‌రిపించాం. వారి వివ‌రాల‌ను సేక‌రించాం. ఈ గ్రామంలో మొత్తం 76 ద‌ళిత కుటుంబాలు ఉన్నాయి. వాసాల‌మ‌ర్రిలో 100 ఎక‌రాల‌కు పైగా ప్రభుత్వ మిగులు భూమి ఉంది. ప్రభుత్వ మిగులు భూముల‌ను ద‌ళిత కుటుంబాల‌కు పంపిణీ చేస్తాం. ద‌ళితుల భూమిని మ‌రెవ్వరూ తీసుకునే అర్హత లేదు. ప్రతి ద‌ళిత బిడ్డ రైతు కావాలి. వాసాల‌మ‌ర్రిలో కొత్త చ‌రిత్ర సృష్టించాలి” అని సీఎం కేసీఆర్ తెలిపారు.

Read also: Lover Attack: ప్రేమించలేదని యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది.. బోయిన్‌పల్లిలో కలకలం