ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై… సీబీఎస్ఈ బాటలోనే తెలంగాణ ఇంటర్ బోర్డు సాగే అవకాశం ఉంది. పరీక్షల రద్దుకు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నేడు లేదా రేపు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని విద్యా శాఖ అధికారుల నుంచి సమాచారం అందుతోంది. జులై 15 తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నిర్వహించాలనుకుంటున్నామని కేంద్రానికి ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ అభిప్రాయాన్ని తెలిపింది. అయితే గతంలో పది, పదకొండో తరగతుల పరీక్షలు రద్దు చేస్తున్నట్లు సీబీఎస్ఈ ప్రకటించగానే.. మరుసటి రోజే తెలంగాణ సర్కార్ కూడా టెన్త్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో విద్యకు సంబంధిత విషయాలన్నీ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారమే నడుచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖకు గతేడాదే సూచించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్రంలో సుమారు నాలుగున్నర లక్షల మంది విద్యార్థులు ఇంటర్ రెండో సంవత్సరం కంప్లీట్ చేశారు. సీబీఎస్ఈ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది.
Also Read: అనవసరంగా రోడ్లపైకి రావొద్దు.. లాక్‌డౌన్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీజీపీ మహేందర్ రెడ్డి