బ్రేకింగ్ : తెలంగాణ ప్రభుత్వం హైఅలర్ట్.. సాయంత్రం కేబినెట్ భేటీ..

| Edited By:

Mar 14, 2020 | 12:42 PM

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ ఎఫెక్ట్‌తో నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్ష మందికి పైగా కరోనా ప్రభావంతో అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించింది. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు 65 మందికి కరోనా సోకిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీరిలో 17 మంది విదేశీయులేనని.. […]

బ్రేకింగ్ : తెలంగాణ ప్రభుత్వం హైఅలర్ట్.. సాయంత్రం కేబినెట్ భేటీ..
Follow us on

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి తెలిసిందే. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ వైరస్ ఎఫెక్ట్‌తో నాలుగు వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్ష మందికి పైగా కరోనా ప్రభావంతో అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం వీరంతా చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించింది. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటి వరకు 65 మందికి కరోనా సోకిందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వీరిలో 17 మంది విదేశీయులేనని.. ఇందులో 10 మంది కరోనాను జయించారన్నారు. ఇద్దరు మాత్రం చనిపోయారని తెలిపారు.

ప్రతి వందేళ్లకు ఒకసారి ఇలాంటి వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోందన్నారు. గతంలో ఇలాంటి వైరస్‌తో కోటి 4 లక్షల మంది చనిపోయారని తెలిపారు. రాష్ట్రంలో ఇటలీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చిందని.. మరో ఇద్దరు అనుమానితుల రిపోర్ట్స్ రావాల్సి ఉందని కేసీఆర్ అసెంబ్లీలో తెలిపారు. బయటి దేశాల నుంచి వచ్చిన వారే ఈ వైరస్‌ను దేశంలోకి తీసుకోస్తున్నారన్నారు. చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే మాల్స్, థియేటర్లు, స్కూళ్లు మూసివేశారని.. ఎయిర్ పోర్ట్, మెట్రోలో ప్రయాణీకులు గణనీయంగా పెరిగారన్నారు. ఏడు దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించొద్దని కేంద్రం ఆదేశించిందని.. ఒకవేళ ఆ దేశాల నుంచి భారతీయులు వస్తే.. 14 రోజుల పాటు పరిశీలించాలని సూచించిందన్నారు. ప్రస్తుతం 200 మంది ఆరోగ్య సిబ్బంది ఎయిర్‌పోర్టులో ఉన్నారని తెలిపారు.

సాయంత్రం కేబినెట్ భేటీ

కరోనాపై సమన్వయ కమిటీ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తోందని.. మన రాష్ట్రానికి ప్రమాదం లేకున్నా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇవాళ సాయంత్రం కేబినెట్‌లో కరోనా వైరస్, ప్రత్యేక చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ భేటీలో సినిమా హాళ్లు, స్కూళ్ల మూసివేతపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.