CM KCR Approves PRP: సింగరేణి అధికారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్ .. పీఆర్‌పీ కోసం రూ.111 కోట్లు మంజూరు

సింగరేణి అధికారులు కారులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. అధికారులకు పీఆర్ఫీ చెల్లించడానికి అంగీకరించారు. 2018-19 ఏడాదిలో సింగరేణి అధికారుల ప్రతిభను..

CM KCR Approves PRP: సింగరేణి అధికారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్ .. పీఆర్‌పీ కోసం రూ.111 కోట్లు మంజూరు

Updated on: Jan 06, 2021 | 10:09 PM

CM KCR Approves PRP:సింగరేణి అధికారులు కారులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. అధికారులకు పీఆర్ఫీ చెల్లించడానికి అంగీకరించారు. 2018-19 ఏడాదిలో సింగరేణి అధికారుల ప్రతిభను ఆధారంగా చేసుకుని ప్రభుత్వం ఈ చెల్లింపులు చేపట్టనుంది. ప్రతిభ ఆధారిత చెల్లింపుల కోసం ముఖ్యమంత్రి రూ.111 కోట్లు మంజూరు చేశారు. ఈమేరకు ఫిబ్రవరిలో సింగరేణి అధికారులకు పీఆర్‌పీ చెల్లింపులుంటాయని సింగరేణి సీఎండీ శ్రీధర్ తెలిపారు.

ఇక మరో వైపు ఎమ్మెల్సీకవితతో సింగరేణి ఎస్సి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నేతల భేటి అయ్యారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ.. ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఆమెకు ఓ వినతి పత్రం ఇచ్చారు. జీవో ఎంఎస్ నెంబర్ 59 ప్రకారం కోటి రూపాయల వరకు ఉన్న పబ్లిక్ వర్క్స్ లో ఎస్సీ ఎస్టీలకు 21 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఉద్యోగుల సమస్యలను విన్న కవిత
సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా సమస్యల పరిష్కరానికి చర్యలు చేపడతానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు.

Also Read: ఎవరు చూస్తే వారి ఎత్తులోనే కనిపించే శ్రీవిష్ణు ఆలయం తొలి తిరుపతి ఎక్కడో తెలుసా?