Breaking News: నల్గొండ జిల్లాపై వరాల జల్లు కురిపించిన సీఎం కేసీఆర్.. రేపు జీవో విడుదల చేస్తామంటూ..
Cm KCR Speech: నల్గొండ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపంచారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక..
Cm KCR Speech: నల్గొండ జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపంచారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని హాలియాలో టీఆర్ఎస్ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లా ప్రజలపై వరాలు కురిపించారు. జిల్లాలోని మున్సిపాలిటీలకు భారీగా నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. నల్గొండ జిల్లాలో 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్న సీఎం కేసీఆర్.. ప్రతి గ్రామ పంచాయతీకి రూ. 20 లక్షలు చొప్పున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షల చొప్పున మంజూరు చేస్తామన్నారు. ఇక నల్గొండ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం రూ. 10 కోట్లు విడుదల చేస్తామన్నారు. అలాగే మిర్యాలగూడ మున్సిపాలిటీకి రూ. 5 కోట్లు, జిల్లా పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు రూ. కోటి చొప్పున నిధులు మంజూరు చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇవి వట్టి ప్రకటనలు కావని, గురువారం నాడే దీనికి సంబంధించిన జీవోలు విడుదల చేస్తామని సీఎం తెలిపారు. ఇక జిల్లాలోని నెల్లికల్లు, చింతలపాలెం ప్రాంతాల్లో భూ వివాదాలు ఉన్నాయని, వాటిని త్వరలోనే పరిష్కరించి అర్హులందరికీ పట్టాలు అందిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
CM KCR Speech Live:
Also read:
13 ఎత్తిపోతల పథకాలకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన.. కొత్త లిఫ్టులతో ఏయే నియోజకవర్గాలకు నీరందుతుందంటే..