Jr NTR: ‘సీఎం ఎన్టీఆర్.. సీఎం ఎన్టీఆర్’.. టీడీపీ సభలో తెలుగు తమ్ముళ్ల నినాదాలు.. జోష్ మామూలుగా లేదుగా..

ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో టీడీపీ అధ్వర్యంలో బుధవారం భారీ బహిరంగ సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు.

Jr NTR: ‘సీఎం ఎన్టీఆర్.. సీఎం ఎన్టీఆర్’.. టీడీపీ సభలో తెలుగు తమ్ముళ్ల నినాదాలు.. జోష్ మామూలుగా లేదుగా..
Cm Jr Ntr Slogans
Follow us

|

Updated on: Dec 22, 2022 | 8:05 AM

ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో టీడీపీ అధ్వర్యంలో బుధవారం భారీ బహిరంగ సభ జరిగిన విషయం తెలిసిందే. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. హరికృష్ణ కూతురు సుహాసిని సైతం హాజరు కాగా.. హరికృష్ణ మరో వారసుడు జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి స్లోగన్లు.. ఫ్లెక్సీలు, కార్యకర్తల కోలాహాలు హల్ చల్ చేయడం తెలుగు తమ్ముళ్లలో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో బయలు దేరిన చంద్రబాబు.. తొలుత ఖమ్మం సరిహద్దులోని నాయకన్ గూడెం చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. దారి పొడువునా కార్యకర్తలు అభిమానులు బాబుకు స్వాగతం పలికారు. ఖమ్మం సర్దార్ స్టేడియంకు భారీ ర్యాలీగా చేరుకుని నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

చాలా రోజుల తర్వాత తాను ఖమ్మం వచ్చాననీ. ఈ సభకు మీరంతా వచ్చారనీ. అందులోనూ మీలో యువత ఎక్కువగా ఉన్నారనీ.. సంతోషం వ్యక్తం చేశారు చంద్రబాబు. తాను అధికారం కోరుకోలేదనీ. మీ అభిమానం మాత్రమే కోరుకున్నాననీ అన్నారు చంద్రబాబు. తెలంగాణకు టీడీపీ ఏం చేసిందో గుర్తు తెచ్చుకోవాలనీ. తెలుగుదేశం ఆవర్భవించిందే ఈ తెలంగాణ గడ్డపైనని గుర్తు చేశారు టీడీపీ అధినేత. తాను ఏనాడూ ఎన్నికల కోసం పని చేయలేదనీ. తెలుగువారి ఆత్మగౌరవం కోసమే పని చేశానని అన్నారాయన. ఇటీవల బాలకృష్ణ నిర్వహించిన అన్ స్టాపబుల్ లో తాను అన్ని విషయాలు మనసు విప్పి మాట్లాడాననీ అన్నారు నారా చంద్రబాబు. హైటెక్ సిటీ కట్టాననీ.. కాలికి బలపం కట్టుకుని మరీ ప్రపంచమంతా తిరిగాననీ అన్నారు చంద్రబాబు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చాం. భద్రాచలం వరదలో మునగకుండా కరకట్ట కట్టి కాపాడామనీ. తెలంగాణలో టీడీపీ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు.

టీడీపీ ఎక్కడుందనే వారికీ ఖమ్మం సభే సమాధానమని అన్నారాయన. ఆంధ్రకన్నా తెలంగాణలోనే ఎక్కువ అభిమానం చూపుతున్నారనీ.. రెండు రాష్ట్రాలను కలుపుతామని చేతగాని మాటలు మాట్లాడుతున్నారనీ. బుద్ధున్న వారెవరైనా ఇలా మాట్లాడుతారా..? అని ప్రశ్నించారు చంద్రబాబు. తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఒక్క తెలుగుదేశానికే ఉందనీ. ఈ పార్టీ నుంచి గెలిచిన వారు వేరే పార్టీకి వెళ్లారనీ. టీడీపీ ద్వారా ఎందరో లబ్ది చెందారనీ.. ఇలాంటి వారు తిరిగి పార్టీలోకి రావాలనీ. పూర్వవైభవం తీసుకురావాలనీ పిలుపునిచ్చారు చంద్రబాబు. వరదబాధితులను ఆదుకోవాలి. రైతులకు గిట్టుబాట ధర కలిపించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. కాగా, ఈ సభలో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు పట్టుకుని.. సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడం కనిపించింది.

ఇవి కూడా చదవండి

ఖమ్మం టూర్ లో భాగంగా.. కేశవాపురం, పాతర్లపాడు గ్రామాల్లో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు చంద్రబాబు. అయితే చంద్రబాబు ర్యాలీ, బహిరంగ సభల్లో జూనియర్ ఎన్టీఆర్ జెండాలు, ఎన్టీఆర్ సీఎం అనే నినాదాలు.. సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

ఈ చిన్న గింజలను మజ్జిగలో నానబెట్టి తాగితే చాలు..మధుమేహానికి మందు!
ఈ చిన్న గింజలను మజ్జిగలో నానబెట్టి తాగితే చాలు..మధుమేహానికి మందు!
కొత ఆటగాళ్లకు నో ఛాన్స్.. కట్‌చేస్తే.. టీమిండియా కెప్టెన్‌పై వేటు
కొత ఆటగాళ్లకు నో ఛాన్స్.. కట్‌చేస్తే.. టీమిండియా కెప్టెన్‌పై వేటు
పిల్ల జమీందార్ హీరోయిన్ గుర్తుందా?
పిల్ల జమీందార్ హీరోయిన్ గుర్తుందా?
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
ఖాళీ కడుపుతో ఈ పండు ఒక్కముక్క తింటే చాలు..ఈ రోగాలన్నీ పరార్..!
ఖాళీ కడుపుతో ఈ పండు ఒక్కముక్క తింటే చాలు..ఈ రోగాలన్నీ పరార్..!
36 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని రోహిత్ శర్మ కొనసాగించేనా?
36 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని రోహిత్ శర్మ కొనసాగించేనా?
అఖండ 2 ప్రారంభం.. పూజా కార్యక్రమాల్లో బాలయ్య కుమార్తెలు.. ఫొటోస్
అఖండ 2 ప్రారంభం.. పూజా కార్యక్రమాల్లో బాలయ్య కుమార్తెలు.. ఫొటోస్
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
అప్పుడే కంగువా కలెక్షన్లు చెప్పిన నిర్మాత.. నెటిజన్ల ట్రోలింగ్..
అప్పుడే కంగువా కలెక్షన్లు చెప్పిన నిర్మాత.. నెటిజన్ల ట్రోలింగ్..
పాపం.. రీల్స్‌ పిచ్చితో రిస్క్‌ చేశాడు.. జారిపడితే ప్రాణం పోయింది
పాపం.. రీల్స్‌ పిచ్చితో రిస్క్‌ చేశాడు.. జారిపడితే ప్రాణం పోయింది
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
వామ్మో! ఆ ఉడిపి హోటల్‌ లో ఇడ్లీలో ప్రత్యక్షమైన జెర్రి.! తరువాత.?
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
సముద్ర తీరంలో వింత పదార్థం.! మిస్టరీగా మారిన పిండిముద్ద ఆకారం..
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
ఏపీలో భారీ వర్షాలు.. బంగాళాఖాతంలో అల్పపీడనం. 48 గంటల్లో వాయుగుండం
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
న్యూయార్క్ వెళ్లాల్సిన విమానం ఢిల్లీలోనే ఎందుకు దిగిపోయింది.?
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
తాగినోళ్లు.. తిన్నగా ఉండొచ్చు కదా.! సవాళ్లకు పోయి చిక్కుల్లో..
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
వెంట్రుక వాసిలో తప్పించుకుంది.. లేదంటేనా! నడిచి వెళ్లిన నో సేఫ్టీ
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
ఇంట్లో ఎవరి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు.? రూల్స్‌ ఎలా ఉన్నాయి.?
అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి
అదేమైనా గుర్రం అనుకున్నవా గురూ..!పులి మీద సవారీ చేసిన వ్యక్తి
దూసుకొస్తున్న వాయుగుండం.. స్కూళ్లకు సెలవులు..
దూసుకొస్తున్న వాయుగుండం.. స్కూళ్లకు సెలవులు..
ముసలోళ్లే కానీ.. అదరగొట్టేశారు.! సాహసమనే చెప్పాలి..
ముసలోళ్లే కానీ.. అదరగొట్టేశారు.! సాహసమనే చెప్పాలి..