KTR-Revanth: డ్రగ్స్‌పై మాట్లాడొద్దు.. రేవంత్ రెడ్డికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సిటి సివిల్‌ కోర్టు..

|

Sep 21, 2021 | 6:43 PM

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది సిటి సివిల్‌ కోర్టు. ప్రతిపక్షాలు చేస్తున్న అడ్డగోలు విమర్శలను సహించేది లేదన్న మంత్రి కేటీఆర్.. యాక్షన్‌ప్లాన్‌ మొదలుపెట్టారు.

KTR-Revanth: డ్రగ్స్‌పై మాట్లాడొద్దు.. రేవంత్ రెడ్డికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సిటి సివిల్‌ కోర్టు..
Revanth Reddy Ktr
Follow us on

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది సిటి సివిల్‌ కోర్టు. ప్రతిపక్షాలు చేస్తున్న అడ్డగోలు విమర్శలను సహించేది లేదన్న మంత్రి కేటీఆర్.. యాక్షన్‌ప్లాన్‌ మొదలుపెట్టారు. అందులో భాగంగా రేవంత్‌ రెడ్డిపై కోటి రూపాయలకు పరువునష్టం దావా వేశారు. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. డ్రగ్స్‌, ఈడీ కేసుల్లో కేటీఆర్‌ను ఉద్దేశించి ఎలాంటి కామెంట్స్ చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 20కి వాయిదా పడింది. కౌంటర్ దాఖలు చేయాలని రేవంత్‌రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది.

ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడు మరో లెక్క. నోటికొచ్చినట్టు మాట్లాడితే యాక్షన్‌ తప్పదు. ఈ మాటలు చెప్పిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ యాక్షన్‌ప్లాన్‌ అమలు చేస్తున్నారు. T.PCC అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్‌ పరువు నష్టం దావా వేశారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది సిటీ సివిల్‌ కోర్ట్‌లో విచారణ జరిగింది.

రోజు రోజుకూ మితీమీరి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై సీరియ‌స్ అయ్యారు మంత్రి కేటీఆర్. రాజకీయ దురుద్దేశంతో, అసత్యాలను అబద్దాలను ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి పై సిటీ సివిల్ కోర్టు లో పరువు నష్టం కేసును దాఖలు చేశారు. గత కొంత కాలంగా తనపై అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని, ప్రస్తుతం ఈడీ నిర్వహిస్తున్న విచారణకు హాజరవుతున్న వ్యక్తులతో కానీ ఆయా కేసులతో కానీ ఎలాంటి సంబంధం లేకున్నా, దురుద్దేశ పూర్వకంగా తన పేరును వాడుకుంటున్నారని పేర్కొన్నారు.

దీనికి సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేటీఆర్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల కలిగిన పరువు నష్టానికి తగిన పరిహారం చెల్లించడంతో పాటు క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ని సైతం ప్రారంభించాలని కోరారు. రేవంత్ చేస్తున్న అసత్య ప్రచారాలను గుర్తించి, ఇలాంటి దురుద్దేశ కార్యక్రమాలకు పాల్పడుతున్న నిందితులను గౌరవ న్యాయస్థానం తగిన విధంగా శిక్షిస్తుందన్న విశ్వాసం తనకు ఉందంటూ కేటీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

కోటి రూపాయలకు రేవంత్‌పై పరువునష్టం దావా వేశారు కేటీఆర్. అయితే సరైన కంటెంట్‌ లేదని.. మరింత క్లారిటీతో తిరిగి పిటిషన్ వేయాలని సూచించింది సిటీ సివిల్ కోర్టు. న్యాయస్థానం చెప్పినట్లుగా మరింత సమాచారం జోడించి…సోమవారం మరోసారి డిఫమేషన్ సూట్ వేశారు మంత్రి కేటీఆర్.

ఇవి కూడా చదవండి: Kodali Nani: రాజీనామా చేసి గెలిస్తే.. బాబు బూట్లు తుడుస్తా.. సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి నాని..