chinna jeeyar swamy: సమ్మక్క- సారక్కల మీద వ్యాఖ్యలపై చినజీయర్​స్వామి ఫుల్ క్లారిటీ

గత కొన్నిరోజులుగా సోషల్ ​మీడియాలో వైరల్​ అవుతున్న తన వ్యాఖ్యలపై త్రిదండి చినజీయర్​ స్వామి వివరణ ఇచ్చారు. ఎప్పుడూ ఆదివాసీలను అవమానించలేదని పేర్కొన్నారు.

chinna jeeyar swamy: సమ్మక్క- సారక్కల మీద వ్యాఖ్యలపై చినజీయర్​స్వామి ఫుల్ క్లారిటీ
Chinna Jeeyar Swamy

Updated on: Mar 18, 2022 | 8:02 PM

Telangana: ఎప్పుడో 20 ఏళ్ల క్రితం మాట్లాడిన మాటలు. ఇప్పుడు వివాదం అయ్యాయి. అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఎంతోమంది ప్రశ్నించారు. మరెంతో మంది నిలదీశారు. ఇదిగో వీటన్నింటికీ అత్యంత స్పష్టంగా, సూటిగా, కుండబద్దలు కొట్టినట్లుగా…సమాధానాలు చెప్పారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి. ఆదివాసీ వనదేవతలను అవమానించారన్న దగ్గరి నుంచి… రాజకీయాల వరకు అన్ని అంశాలపైనా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. లక్ష్మీదేవి పుట్టినరోజు సందర్భంగా ఏపీ(AP)లోని విజయవాడ(Vijayawada) కనకదుర్గ అమ్మవారి ఆలయానికి వెళ్లిన చినజీయర్​ స్వామి.. ఈ వివాదంపై స్పందించారు.  అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పేశారు. ఆదివాసి దేవతలను తులనాడినట్లు చేస్తున్న ప్రచారం నిజం కాదన్నారు చినజీయర్ స్వామి. పూర్వాపరాలు చూడకుండా..మధ్యలో మాట్లాడిన కొన్ని అంశాలను తీసుకొని కావాలనే దుష్ప్రచారం చేశారని చెప్పారు. ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే అని విమర్శించారు. సమతామూర్తి విగ్రహం నిర్వహణ కోసం టికెట్ పెట్టామే తప్ప.. పూజలు, ప్రసాదాలకు కాదని స్పష్టం చేశారు..

తమకు ఎవరితోనూ గ్యాప్స్ ఉండవని స్పష్టం చేశారు చినజీయర్ స్వామి. కావాలని వాళ్లు పెట్టుకుంటే ఏం చేయలేమన్నారు. మహిళలు, ఆదివాసీలను వెలుగులోకి తీసుకురావాలన్న భావన నుంచి వచ్చిన తాము… వారిని అవమాన పరిచేలా ఎప్పుడూ మాట్లాడమని స్పష్టం చేశారు. రాజకీయాలకు చాలా దూరమని చెప్పారు.  దేశంమంతా సమతామూర్తిస్థాపన గురించి మాట్లాడుకుంటున్న వేళ.. అది సహించని కొందరు తమపై విషప్రచారం చేయాలని చేసిన చర్యగా భావిస్తామన్నారు.  మాంసాహారంపై గతంలో చెప్పిన మాటలను వివాదాస్పదం చేయడంపైనా పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఎవరితోనూ రాసుకుపూసుకు తిరిగే మనస్తత్వం తమది కాదన్నారు చినజీయర్ స్వామి. కానీ ఏదైనా బాధ్యత తీసుకుంటే మాత్రం వంద శాతం నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు. సమాజంలో జరుగుతున్న తప్పులను చెబుతూ హెచ్చరిచ్చడం తమ బాధ్యత అని అన్నారు. ఏది కావాలని ఎవరినీ అడగమని..పిలిస్తే వెళ్తాం… లేదంటే చూసి ఆనందిస్తామని తెలిపారు.

Also Read: Hyderabad: యమపాశంలా దూసుకువచ్చిన కారు.. మహిళ స్పాట్‌లో మృతి..