CM KCR: పార్లమెంట్‌లో ప్రధాని మోదీ స్పీచ్‌ అధ్వానం.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ విమర్శలు..

|

Feb 12, 2023 | 4:37 PM

అదానీ గురించి ప్రధాని మోదీ సమాధానం చెప్పకుండా జబ్బ కొట్టుకున్నాడని విమర్శించారు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు. కంపెనీ పెడతానంటూ అదానీ తెలంగాణకు కూడా వచ్చారు..

CM KCR: పార్లమెంట్‌లో ప్రధాని మోదీ స్పీచ్‌ అధ్వానం.. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ విమర్శలు..
Chief Minister K Chandrashekhar Rao
Follow us on

పార్లమెంట్‌లో ప్రధాని మోదీ స్పీచ్‌ అధ్వానంగా ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(సీఎం కేసీఆర్) విమర్శలు గుప్పించారు. అదానీ గురించి ప్రధాని మోదీ సమాధానం చెప్పకుండా జబ్బ కొట్టుకున్నాడని విమర్శించారు. కంపెనీ పెడతానంటూ అదానీ తెలంగాణకు కూడా వచ్చారు.. అదృష్టం బాగుండి మన దగ్గరకు అదానీ కంపెనీ రాలేదని అన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. ఎప్పుడో చనిపోయిన నెహ్రూ, ఇందిరాగాంధీ పేర్లతో రాజకీయమేంటని ప్రశ్నించారు.

నువ్వెన్ని ప్రభుత్వాలు కూలగొట్టావంటే నువ్వెన్ని.. అంటూ మోదీ, రాహుల్‌ పార్లమెంట్‌లో గొడవపడుతున్నారని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. మొత్తం 192 దేశాల్లో మన దేశం ర్యాంక్‌ 139 అని.. అదే తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్‌, శ్రీలంక కంటే భారత్‌ ర్యాంక్‌ తక్కువ ఉందన్నారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్‌  అంటూ విమర్శించారు. మన దేశం 3.3 ట్రిలియన్‌ డాలర్ల దగ్గరే ఆగిపోయిందని .. కనీసం ఆకాశానికి ఆలోచన ఉండాలన్నారు. ఏదైనా తప్పు జరిగితే ఒప్పుకునే ధైర్యం ఒప్పుకోవాలన్నారు.

గత ప్రధాని మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో కంటే ప్రధాని మోదీ హయాంలో భారత్ అభివృద్ధి జరగలేదని.. కాంగ్రెస్ హయాంలోని ప్రధాని మన్మోహన్ సింగ్ పని చేసినా.. చేయలేదని బీజేపీ నిందలు వేసిందన్నారు. ప్రధాని మోదీ పాలన కంటే మన్మోహన్ సింగ్ పాలన 100 శాతం బెటర్ అని కేసీఆర్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. దేశంలో 157 మెడికల్‌ కాలేజీలు ఇస్తే తెలంగాణకు ఒక్క మెడికల్‌ కళాశాల ఇవ్వలేదని మండిపడ్డారు. ఇదేనా ఫెడరల్‌ వ్యవస్థ అని ప్రశ్నించారు. పరిశ్రమలు మూతపడుతున్నాయని.. బీజేపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల మంది దేశ పౌరసత్వాన్ని వదిలిపెట్టుకుని వెళ్లిపోయారని అన్నారు. ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. మన్మోహన్‌సింగ్‌ బాగా పనిచేసినా బీజేపీ బద్నాం చేసిందని గుర్తు చేశారు.

కాంగ్రెస్ వాళ్ళు ప్రజలకు ఏం చెయ్యలేదని చెప్పి బీజేపీ అధికారంలోకి వచ్చిందన్నారు. బిజెపికి నీ నమ్మి ఒట్లేస్తే మోడీ గెలిచి భారత దేశం ఓడిపోయింది. సిటిజన్లు , పరిశ్రమలు, మేధావులు దేశం విడిచి వెళ్లిపోతున్నారు. పార్లమెంట్ లో మోడీ ప్రసంగం అంతా అబద్ధాలు.. అధాని గురించి మాట్లాడకుండా దట వేశారు. దేశం కోసం ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదు. అదాని ఉపద్రవం పై ఏం చేస్తారో చెప్పాల్సివుండే.. శాసనసభ లో ఈటెల రాజేందర్.. సభ ఇంకొన్ని రోజులు జరిపితే భావుండేది.

లైవ్ ఇక్కడ చూడండి..


మరిన్ని తెలంగాణ వార్తల కోసం