Chicken Sale: సంక్రాంతి పండగకు హైదరాబాద్ వాసుల సరికొత్త రికార్డ్.. 3 రోజుల్లో ఎన్ని లక్షల కిలోలు చికెన్ తిన్నారో తెలిస్తే షాక్..

|

Jan 17, 2022 | 8:34 AM

Chicken Sale in GHMC: తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి(Sankranti). భోగి, సంక్రాంతి, కనుమగా మూడురోజుల పాటు జరుపుకునే ఈ పండగ రోజున గ్రేటర్ హైదరాబాద్ (GHMC)నగర వాసులు సరికొత్త చరిత్ర..

Chicken Sale: సంక్రాంతి పండగకు హైదరాబాద్ వాసుల సరికొత్త రికార్డ్.. 3 రోజుల్లో ఎన్ని లక్షల కిలోలు చికెన్ తిన్నారో తెలిస్తే షాక్..
Chicken Sale
Follow us on

Chicken Sale in GHMC: తెలుగువారి పెద్ద పండగ సంక్రాంతి(Sankranti). భోగి, సంక్రాంతి, కనుమగా మూడురోజుల పాటు జరుపుకునే ఈ పండగ రోజున గ్రేటర్ హైదరాబాద్ (GHMC)నగర వాసులు సరికొత్త చరిత్ర సృష్టించారు. సంక్రాంతి పండగ కదా ముగ్గులు, గొబ్బెమ్మలు, గాలిపటాలు ఎగరవేయడం వంటి వాటిల్లో రికార్డు సృష్టించారనుకోకండి..ఈ పండగకు రికార్డ్ స్థాయిలో చికెన్ ను లాగించేశారు నగర వాసులు. భోగి పండగ శుక్రవారం రోజు నుంచి కనుమ పండగ ఆదివారం వరకూ కేవలం ఈ మూడు రోజుల్లో 60 లక్షల కిలోల చికెన్ ను భాగ్యనగర వాసులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. మటన్ ధర చికెన్ కాస్ట్ కంటే ఎక్కువగా ఉండడంతో.. ఎక్కువ మంది ప్రజలు కోడి మాసం కొనుగోలుకే ఆసక్తిని చూపించారు.

హైదరాబాద్ లో కిలో మటన్ రూ.850 నుంచి రూ.900ల వరకూ ఉంది. అదే కోడి మాసం అయితే కిలో రూ.240 మాత్రమే. దీంతో అధికంగా చికెన్ కొనుగోలుకే ఆసక్తిని చూపించారు. అయితే సాధారణ రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో రోజుకు 10 లక్షల కిలోల చికెన్‌ అమ్మకాలు జరుగుతాయని అమ్మకందారులు చెప్పారు. అయితే సంక్రాంతి పండగ నేపధ్యంలో అధిక జనాభా పల్లె బాట పట్టారు. అయినప్పటికీ సంక్రాంతి పండగ సందర్భంగా శుక్ర, శని వారాల్లో దాదాపు 30 లక్షల కేజీల కోడి మాసం అమ్మకాలు జరిగాయి. కనుమ, ఆదివారం కలిసి రావడంతో ఈ ఒక్కరోజే అత్యధికంగా 30 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరిగినట్లు అంచనా.

మరోవైపు మటన్ కూడా రోజువారీ అమ్మకాల కంటే అధికంగా జరిగాయి. మాములు రోజుల్లో 2 లక్షల కిలోల మటన్ విక్రయాలు జరుగుతుండగా.. ఆదివారం మాత్రం 5 లక్షల కిలోల మటన్ ను భాగ్యనగర వాసులు ఖరీదు చేసినట్లు తెలుస్తోంది. పండగ మూడు రోజుల్లోనే 10 నుంచి 15 లక్షల కిలోల మటన్ మటన్‌ అమ్మకం జరిగిందని వ్యాపారస్తులు చెబుతున్నారు. అంతేకాదు భారీ మొత్తంలో అమ్మకాలు జరగడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read:

 ఫించన్‌దారులకు ఈపీఓఫ్‌ఓ గుడ్‌న్యూస్‌.. పెన్షన్‌ డబ్బుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు..!