
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలోఆలయ పరిసరాల్లో ఉండే యాచకులకు, కొందరు ఇలా చికెన్ బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అయితే ఆలయ పరిసరాల్లోకి మాంసాహారం తీసుకు వెళ్ళొద్దనే నిబంధనలకు విరుద్ధంగా ఈ ఘటన జరగడం, పైగా ప్రధాన ఆలయం సమీపంలోని బిర్యానీ ప్యాకెట్లను పంచడం కలకలం రేపింది. విషయం తెలుసుకున్న స్థానిక బిజెపి నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని మాంసహారంతో కూడిన పాకెట్లను స్వాధీనం చేసుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అయితే ఆలయ ప్రాంగణంలో అనే మతానికి చెందిన మాంసాహారం ప్యాకెట్ లను పంపిణీ చేసిన ఆలయ యంత్రాంగం గమనించకపోవడం పై విమర్శలు వెలువెత్తుతున్నాయి. రాజన్న ఆలయంలో రోజుకో వివాదంతో మసకబారుతోంది ఈ సంఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.జరిగిన సంఘటనపై ఆలయ ఈవోతో పాటు పోలీసులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..