
సోమవారం ఉదయం రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల దగ్గర జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందడం యావత్ రాష్ట్రాన్ని విషాదంలోకి నెట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చెరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది పలువురి ప్రయాణికులను కాపాడి హాస్పిటల్‌కు తరలించారు. అయితే ప్రమాదంలో ఇప్పటి వరకు 14 మృతదేహల వివరాలను అధికారులు గుర్తించారు. మరి కొంత మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వారిని హైదరాబాద్‌లోని గాంధీ, ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 70 మంది వరకు ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించిన అధికారులు పోస్ట్‌మార్టం నిర్వహించి ఆ మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నారు. ఇప్పటివరకు నాలుగు మృతదేహాలకు పోస్ట్‌మార్టం పూర్తి చేసినట్టు అధికారులు చెబుతున్నారు. వారిలో కర్నాటక రాష్ట్రానికి చెందిన నాగమని అనే మృతదేహం, గంగారం తండాకు తరిబాయి అనే మహిళ మృతదేహం తరలింప. మృతుడు నజీర్ మృతదేహాన్ని తాండూర్‌కు తరలించిన అధికారులు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.