కామారెడ్డిలో చెట్టు తొర్రలో చిరుతపులి పిల్లలు…

|

Mar 09, 2020 | 2:32 PM

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట శివారు అటవీ ప్రాంతంలో పిల్లుల మాదిరిగా ఉన్న రెండు పులి పిల్లలు...

కామారెడ్డిలో చెట్టు తొర్రలో చిరుతపులి పిల్లలు...
Follow us on

ఈ ఫోటోలో కనిపిస్తున్నవి పిల్లి పిల్లలు అనుకుంటున్నారా..? అయితే, మీరు పొరపడినట్లే..ఎందుకంటే అవి పిల్లి పిల్లలు కాదు..అడవిలోని పెద్దపులి పిల్లలు..అవును..కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం భవానీపేట శివారు అటవీ ప్రాంతంలో ఆదివారం పిల్లుల మాదిరిగా ఉన్న రెండు పులి పిల్లలు దర్శనమిచ్చాయి. పొలం పనులు చేసుకుంటున్న రైతులకు చెట్టు తొర్రలో పులి పిల్లలు కంటపడ్డాయి. దీంతో ఎల్లారెడ్డి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకొన్నఅధికారులు వాటిని చిరుత పిల్లలుగా గుర్తించారు. ఒకటి రెండు రోజుల క్రితమే అవి జన్మించి ఉంటాయని గుర్తించారు. రెండు పులిపిల్లల కోసం గాలించిన ఫారెస్ట్‌ అధికారులకు ఒక పులికూన మాత్రమే దొరికింది. మరొక పులిపిల్లతో పాటు తల్లి కోసం బోన్ ను ఏర్పాటు చేశారు. ఆ ఏరియా మొత్తం సీసీ కెమెరాలను అమర్చారు. ఒకదానిని మాత్రం హైదరాబాద్‌లోని జూపార్కుకు తరలించారు సిబ్బంది.తప్పించుకున్న మరో పిల్ల ఆచూకీ గుర్తించడానికి సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు.