Telangana: బార్డర్ దాటితే.. బుక్ అయిపోతారు.. జర జాగ్రత్త..

మహారాష్ట్ర సరిహద్దు ప్రాంత ప్రజలు రూ.50 వేలకు మించి నగదుతో సరైన ఆదారాలు, పత్రాలు లేకుండా ప్రయాణం చేస్తే అదికారులు సీజ్ చేయనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. కావున తెలంగాణ రాష్ట్ర సరిహద్దు దాటి మహారాష్ట్రలోకి ప్రయాణించే ప్రజలు తప్పకుండా ఈ కింది నియమాలు పాటించాల్సిందే. లేదంటే రిస్క్ కొని తెచ్చుకున్నట్టే లెక్క..!

Telangana: బార్డర్ దాటితే.. బుక్ అయిపోతారు.. జర జాగ్రత్త..
Telangana State Border
Follow us

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 21, 2024 | 12:03 PM

తాజాగా మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15న షెడ్యూల్ విడుదల చేసింది. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చింది. దీంతో సరిహద్దు‌దాటే ప్రతి ప్రయాణికున్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు అంతర్ రాష్ట్ర చెక్ పోస్టులు కూడా వెలిశాయి. దీంతో ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు ఎన్నికల సంఘం చర్యలను ప్రారంభించింది. అక్రమ మద్యం సరఫరాకు రెడ్ కార్డ్ చూపించింది. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్‌కు నలుమూలలా విస్తరించి ఉన్న మహారాష్ట్ర సరిహద్దు‌ గ్రామాలకు వెళ్లాలంటే ఎన్నికల నిబందనలు తూచా తప్పకుండా పాటించాల్సిందే అంటున్నారు పోలీసులు. లేదు మా ఇష్టం వచ్చినట్టు బార్డర్ దాటుతామంటే కేసులు తప్పవంటున్నారు.

ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మహారాష్ట్రంతో సరిహద్దు బంధం పంచుకుంటున్న మంచిర్యాల, కుమురంభీం, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల సరిహద్దు‌ గ్రామాల్లో మహారాష్ట్ర పోలీసులు చెక్ పోస్టులు ఏర్పటు చేయగా.. అక్రమ మార్గంలో మద్యం, డబ్బు సరఫరా చేసే వారిపై నిఘా పెట్టారు. ఎన్నికల కోడ్లో భాగంగా 50 వేలకు పైన నగదు ఉంటే సరైన పత్రాలు చూపించాలని, లేదంటే నగదు సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు సైతం బార్డర్ దాటితే జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మహారాష్ట్రలోని చంద్రపూర్, నాందేడ్, యావత్మాల్, గడ్చిరోలి జిల్లాలు తెలంగాణ రాష్ట్ర సరిహద్దున ఉండగా.. ఆ జిల్లాలన్నింటితో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలకు బంధం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్, జైనథ్, బేల, తాంసి, ఇచ్చడో, తలమడుగు మండలాలతో మహారాష్ట్రలోని యావత్మాల్ , నాందేడ్, చంద్రపూర్ జిల్లాల్లోని మాండివ్వీ, బోరి, పిప్పల్ కోటి, పాండ్రకవడ ప్రాంతాలు సరిహద్దును‌ పంచుకుంటున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
3 నిమిషాలకు మించి కౌగిలించుకోకండి.! ఎయిర్‌పోర్ట్‌లో కొత్త రూల్‌..
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
48 గంటల్లో మరో వాయుగుండం.. ఈసారి కోస్తాపై మరింత ప్రభావం.!
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
బోయ్‌ఫ్రెండ్స్‌ కావాలంటూ అమ్మాయిల ర్యాలీ.! ప్రేమను కాపాడండి అంటూ
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
కెనడాకు షాక్ ఇచ్చిన భారత్.! మనపై నిరాధార ఆరోపణలు..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
ఆకాశంలో అద్భుతం.. మరో 80 వేల ఏళ్ల వరకు చూడలేం.! వీడియో అదుర్స్..
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
వ్యాధుల సుడిగుండంలో వైద్యులు.. ఇలాగైతే మనల్ని కాపాడేవారెవరు.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
25 ఏళ్లుగా రైళ్లలో అడుక్కునే వ్యక్తి ఎన్ని ఆటోలను కొన్నాడంటే.?
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
త్వరలోనే ఎగిరే ట్యాక్సీలు.. 1.50 గంటల ప్రయాణం 5 నిమిషాల్లోనే.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. రెప్పపాటులో అంత ధ్వంసం.!
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ
జానీ మాస్టర్ విషయంలో శేఖర్,గణేష్ మాస్టర్ అందుకే మాట్లాడలేదు: యానీ