
ఖమ్మం జిల్లా, ఆగస్టు 3: మీ ఇంట్లో నాటు కోళ్లు ఉన్నాయటగా.. మొనగాడి పుంజులని విన్నాం.. ఏ పందెం వేసినా గెలిచి తీరాయతాయని మాకు తెలిసింది. రేటు ఎంతైనా పర్లేదు.. మాకు అవి కావాలి… అంటూ ఆ కోళ్లను పెంచే వృద్ధురాలిని మాటల్లో పెట్టి మాయ చేశారు. ఎవరూ లేని సమయం చూసి ఆమె మెడలోని బంగారపు లాక్కోని పరారయ్యారు. ఖమ్మం జిల్లా.. కొణిజర్ల మండలం తీగల బంజర గ్రామంలో చైన్ స్నాచర్స్ టెన్షన్ రేపారు. వృద్ధురాలని మీ ఇంట్లో నాటు కోళ్లు ఉన్నాయా..మాకు కావాలంటూ..మాటల్లో పెట్టి ఇంటి ఎదురుగా నిలబడి ఉన్న వృద్ధురాలి మెడలో బంగారు గొలుసును ఎత్తుకెళ్లిపోయారు. చైక్ ఇద్దరు చైన్ స్నాచర్స్ వచ్చి.. తన చైన్ లాక్కెళ్లినట్లు ఆమె చెబుతోంది. కొణిజర్ల మండలంలోని తీగలబంజరలో ఈ ఘటన జరిగింది.
గ్రామానికి చెందిన మేరమ్మ తన ఇంటి ముందు నిలబడి ఉండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరిలో ఒకరు కిందకు దిగి నాటుకోళ్లు ఉన్నాయా అని ఆరా తీశారు. ఆమె లేవని చెబుతుండగానే ఇంటి ఆవరణలో ఉన్న కోడిపుంజును అమ్మాలని మాయమాటల్లోకి దింపాడు. మాట్లాడుతుండగానే ఆమె మెడలో ఉన్న లక్షన్నర విలువైన మూడు తులాల బంగారు గొలుసు లాక్కుని ఏణుకూరు వైపు పరారయ్యారు. గొలుసు లాక్కునే సమయంలో కేకలు వేయడంతో బైక్ పై పరారయ్యారు . ఘటనపై మేరమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని స్థానిక ఎస్ఐ తెలిపారు. సీసీ కెమెరాల్లో దుండగులు బైక్‌పై పరారవుతున్న దృశ్యాలు రికార్డయ్యాయి. నిందితులను పట్టేకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
కాగా గుర్తు తెలియని వ్యక్తులు ఊర్లోకి వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. రకరకాల మారువేశాల్లో దొంగలు వచ్చే అవకాశం ఉందని… అలెర్ట్‌గా లేకపోతే ఇళ్లు గుళ్ల అవుతుందని హెచ్చరిస్తున్నారు. అడుక్కునేవారిని కూడా నమ్మడానికి లేదని.. అనుమానం కలిగితే వెంటనే 100 నంబర్‌కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయాలని చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.