
తెలంగాణ వాసులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దశాబ్దాలకు పైగా పెండింగులో ఉన్న కరీంనగర్-హసన్‌పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతనంగా నిర్మించనున్న ఈ రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి యుద్ద ప్రాతిపదికన రీ సర్వే చేసి నివేదిక సమర్పించాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సర్వే నివేదిక వచ్చిన అనంతరమే నిధులు కేటాయింపుతో పాటు రైల్వే లైన్ నిర్మాణ పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఈరోజు న్యూఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి అశ్వీని వైష్ణవ్‌ను కలిసి కరీంనగర్-హసన్‌పర్తి రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యుల్లోని ఐటం నెంబర్-11 ప్రకారం తెలంగాణ అభివృద్ధి చేయాలని బండి సంజయ్ గుర్తు చేశారు. దాదాపు 62 కి.మీల మేరకు పనులు సాగే కరీంనగర్-హసన్‌పర్తి రైల్వే లైన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని బండి సంజయ్ తెలిపారు
దీనితో పాటు మరో శుభవార్త కేంద్రం చెప్పింది. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లిలో రైలు ఆగేలా చర్యలు తీసుకోవాలని, ఆ ప్రాంతంలో స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై కూడా కేంద్రం సముఖత వ్యక్తం చేసింది. కరీంనగర్ – హసన్ పర్తి రైల్వే లేన్ విషయానికొస్తే… 2013లో ఈ రైల్వే లేన్ నిర్మాణానికి సంబంధించి సర్వే చేసినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ధిష్ట సమయంలోగా సరైన నిర్ణయం తీసుకోని కారణంగా రైల్వే లైన్ అంశంలో ఎలాంటి పురోగతి లేకుండా పోయిందని ఈ సందర్భంగా బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 13వ షెడ్యుల్ లోని ఐటం నెంబర్-11 ప్రకారం తెలంగాణ అభివ్రుద్ధికి ఈ సందర్భంగా బండి సంజయ్ గుర్తు చేశారు. దాదాపు 62 కి.మీల మేరకు పనులు సాగే కరీంనగర్ – హసన్ పర్తి ఈ రైల్వే లేన్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని బండి సంజయ్ తెలిపారు.
ప్రధాన ఉత్తర తెలంగాణలోని గ్రానైట్ ఇండస్ట్రీ తోపాటు వరి, పప్పు ధాన్యాలు, పసుపు పంట ఉత్పత్తుల రవాణా సులువు కానుందని పేర్కొన్నారు. బండి సంజయ్ విజ్ఝప్తికి సానుకూలంగా స్పదించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అధికారులను పిలిపించుకుని మాట్లాడారు. యుద్ద ప్రాతిపదికన కరీంగనర్ – హసన్ పర్తి కొత్త రైల్వే లైన్ నిర్మాణంపై రీ సర్వే ను నిర్వహించి పక్షం రోజుల్లో నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
రైల్వేశాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా త్వరలో వచ్చే నెలలో ప్రారంభించేందుకు తమ వంతు క్రుషి చేస్తానని హామీ ఇచ్చారు. అట్లాగే సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో రైలు ఆగేలా ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్న కేంద్ర మంత్రి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కు క్రుతజ్ఝతలు తెలిపారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కరీంనగర్ – హసన్ పర్తి రైల్వే లేన్ నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్లే ఈ రైల్వే లేన్ నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయని, దీనివల్ల ఇంతకాలం ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రజలు ఇబ్బంది పడ్డారని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం