Ration Cards: రేషన్ కార్డులపై ప్రభుత్వం బ్యాడ్ న్యూస్.. 1.40 లక్షల మందికి కట్.. సరుకులు కట్ అయినట్లే..

తెలంగాణలోని రేషన్ కార్డులకు సంబంధించి కేంద్రం పార్లమెంట్‌లో కీలక ప్రకటన చేసింది. ఏకంగా 1.40 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసింది. దీంతో వీరికి రేషన్ కట్ అయింది. అర్హత లేకపోయినా రేషన్ పొందుతున్నారనే ఉద్దేశంతో రేషన్ కార్డులు కట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Ration Cards: రేషన్ కార్డులపై ప్రభుత్వం బ్యాడ్ న్యూస్.. 1.40 లక్షల మందికి కట్.. సరుకులు కట్ అయినట్లే..
Ration Cards

Updated on: Apr 01, 2026 | 3:56 PM

రేషన్ కార్డులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రేషన్ కార్డుల్లో పారదర్శకత తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. కొంతమందికి అర్హత లేకపోయినా రేషన్ కార్డులు పొందుతున్నారు. అక్రమ మార్గంలో రేషన్ కార్డులను పొందుతున్నారు. ఇలాంటి వారిని నివారించి నిజమైన అర్హులకు మాత్రమే లబ్ది చేకూర్చాలనే ఉద్దేశంతో కేంద్రం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రేషన్ కార్డుల రీవెరిఫికేషన్ చేపట్టి అనర్హులను తొలగిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణలో మొత్తం 1.40 లక్షల మంది రేషన్ కార్డులను రద్దు చేసింది. అనర్హులగా తేలడంతో వీరికి రేషన్ కార్డు కట్ చేసింది. అటు ఏపీలో 102 రేషన్ కార్డులు రద్దు చేసింది.

41 లక్షలకుపైగా రేషన్ కార్డులు కట్

పార్లమెంట్‌లో రేషన్ కార్డుల అంశంపై కేంద్ర ఆహార, ప్రజా పంపింణీ సహాయమంత్రి నిముబెన్ జయంతిభాయ్ బాంభానియా కీలక ప్రకటన చేశారు. దేశంలో 41 లక్షలకుపైగా అక్రమ రేషన్ కార్డులను తొలగించినట్లు వెల్లడించారు. ఇక దేశంలో 5.51 లక్షల రేషన్ షాపుల్లో ఆధార్ బయోమెట్రిక్ ద్వారా రేషన్ సరుకులను తీసుకునే విధానం ప్రవేశపెట్టామని, దీని వల్ల సరుకుల పంపిణీలో అక్రమాలకు అడ్డుకట్ట పడిందని స్పష్టం చేశారు. జీఎస్టీ, కార్పొరేట్ వ్యవహారాలు, జాతీయ రహదారులు, ఇన్ కమ్ ట్యాక్స్ శాఖల సమాచారం ఆధారంగా రేషన్ కార్డులను తొలగించినట్లు తెలిపారు. రాజస్థాన్‌లో అత్యధికంగా 6 లక్షలకుపైగా కార్డులను కట్ చేశారు. అటు ప్రజా పంపిణీకి సంబంధించిన డేటా బేస్‌ను ఇతర సంక్షేమ పథకాలతో లింక్ చేసే ప్రతిపాదన కేంద్రం దగ్గర లేదని జయంతిభాయ్ బాంభావియా పార్లమెంట్‌లో పేర్కొన్నారు.

పెరిగిన రేషన్ కార్డులు

ఇక తెలంగాణలో రేషన్ కార్డులు పెరిగాయి. రేవంత్ ప్రభుత్వం వచ్చాక 15 లక్షలకుపైగా కొత్త కార్డులు పెరిగినట్లు కేంద్రం వెలల్డించింది. తెలంగాణలో 17,348 రేషన్ దుకాణాలు ఉండగా.. 1.05 కోట్ల మందికి సరుకుల పంపిణీ జరుగుతోంది. 99,36,073 ఫుడ్ సెక్యూరిటీ కార్డులు ఉండగా.. 5,66,660 అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్నాయి. ఇక అన్నపూర్ణ కార్డులు 5146 ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. జీహెచ్‌ఎంసీ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయి. హైదరాబాద్‌లో 8.39 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో 6.53 లక్షలు, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 6.41 లక్షలు ఉన్నాయి. అతి తక్కువగా ములుగు జిల్లాలో 1.02 లక్షల కార్డులు ఉన్నాయి. కాగా దేశవ్యాప్తంగా మూడు నెలలకు సంబంధించి రేషన్‌ను ఒకేసారి ఏప్రిల్‌లో పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా లబ్దిదారులందరికీ ఒకేసారి ఏప్రిల్, మే, జూన్ నెల కోటా అందించనుంది. ఎండల క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Follow Us