Telangana News: ఉండేదేమో గుడిసెలో.. కానీ రూ.40 వేలతో సీసీ కెమెరాలు పెట్టించాడు.. ఎందుకంటే?

పందెం పుంజులకు సెక్యూరిటీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఐడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంక్రాంతి బరిలో కాళ్ళు దువ్వెందుకు పందెం పుంజులు ముందుంటాయి. మరి అలాంటి కోడి పుంజులను జాగ్రత్తగా పెంచుకునే ఒక వృద్ధుడు గుడిసెలో దొంగలు పడ్డారు. దీంతొ అప్పు చేసి మరీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాడు.

Telangana News: ఉండేదేమో గుడిసెలో.. కానీ రూ.40 వేలతో సీసీ కెమెరాలు పెట్టించాడు.. ఎందుకంటే?
Cc Cameras For Betting Cocks
Follow us
N Narayana Rao

| Edited By: Velpula Bharath Rao

Updated on: Dec 24, 2024 | 4:23 PM

అసలే పేదరికం.. దీనికి తోడు వృద్ధాప్యం కూడా మీద పడటంతో దిక్కు తోచని స్థితిలో ఒక సూపర్ ఐడియా వాళ్ల జీవితాన్నే మార్చేసింది. పందెం పుంజులకు సెక్యూరిటీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ఐడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు.. పందెం పుంజులు హడావుడి మొదలవుతుంది. సంక్రాంతి బరిలో కాళ్ళు దువ్వెందుకు పందెం పుంజులు ముందుంటాయి. మరి అలాంటి కోడి పుంజులను జాగ్రత్తగా పెంచుకునే ఒక వృద్ధుడు గుడిసెలో దొంగలు పడ్డారు. వేల రూపాయలు విలువ చేసే పందెం కోళ్లును దొంగలు ఎత్తుకెళ్లారు. కోడి పుంజులను అమ్మితే వచ్చే డబ్బులే ఆ పేద కుటుంబానికి ఆధారం. అలాంటి ఆ కుటుంబానికి హై పవర్ సెక్యూరిటీలుగా సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. అవును మీరు విన్నది నిజమేనండి. ఇంతకు ఇదంతా ఎక్కడ అనేదే కదా..! అయితే మీరు ఈ కథనం చదవాల్సిందే మరి.

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామానికి చెందిన పామార్తి సత్యం అనే వృద్ధుడు గుడిసెలో నివాసం ఉంటున్నాడు. వయసు మీద పడటంతో బయట పనులకు వెళ్ళలేని పరిస్థితి. దీంతో కుటుంబ పోషణకు ఇంటి వద్దే కోళ్ళు, మేకలు పెంచుకుంటూ ఆర్థికంగా కొంత కుటుంబానికి ఆసరా అవుతుంది. అయితే కొద్ది రోజుల క్రితం పట్ట పగలే గుర్తు తెలియని వ్యక్తులు కొందరు చొరబడి కప్పిన కోళ్లను ఎత్తుకెళ్లారు. ఒకొక్క కోడి పుంజు రూ.25 వేలు నుంచి 50 వేలు, 60 వేలు పైగానే ఉండటంతో చాలా వరకు నష్టపోయినట్లు పామర్తి సత్యం తన గోడు వెళ్ళబుచ్చాడు. అప్పుడే తనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎలాగైనా దొంగల బారిన నుంచి తమ పెంపుడు కోళ్ళు, మేకలను కాపాడుకోవాలంటే సీసీ కెమెరాలు ఏర్పాటు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. వచ్చిందే తడువుగా వెంటనే రూ.40 వేలు అప్పు చేసి మరి సీసీ కెమెరాలను కొనుగోలు చేసి ఆ గుడిసెకు అమర్చాడు. అంతే ఆనాటి నుంచి ఏ ఒక్క అజ్ఞాత వ్యక్తి ఆ ఇంటి దరిదాపుల్లోకి రాలేదని, కోళ్ళు, మేకలు కూడా పోవడం లేదని, చాలా సంతోషంగా ఉన్నామని తన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ