CBI Case File: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగు చూసింది. ఫోర్జరీ సంతకాలు, ఫోర్జరీ పత్రాలతో రూ. 480 కోట్లు కొల్లగొట్టారు. వివరాల్లోకెళితే.. ఫోర్జరీ దస్త్రాలతో బ్యాంకులను మోసగిస్తున్న హైదరాబాద్‌కు దంపతులు పరుచూరి కుమార్ అలియాస్ కనుగంటి సురేష్ కుమార్, అతని భార్య పోకల పల్లవిపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. వీరు ఎస్‌బీఐలో ఫోర్జరీ పత్రాలు పెట్టి రూ. 480 కోట్లు రుణాలు తీసుకున్నారు. అయితే, వీరి మోసాన్ని ఎస్‌బీఐ అధికారులు గుర్తించారు. ఈ చీటింగ్‌లో ఎస్‌బీఐ అధికారి ప్రమేయం కూడా ఉందని నిర్ధారించుకున్న బ్యాంకు అధికారులు.. సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగప్రవేశం చేసిన సీబీఐ అధికారులు.. పరుచూరి కుమార్, అతని భార్య పోకల పల్లవి, ఎస్‌బీఐ అధికారి రవూఫ్ పాషా, న్యాయవాదులు ఉమాపతిరావు, హరిహర్ బాబుపై కేసు నమోదు చేశారు. వీరి చీటింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also read:
CBI Jobs: సీబీఐలో 1,374 ఉద్యోగాలు ఖాళీ.. రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర మంత్రి