అపాయింట్‌మెంట్ లెటర్‌తో ఉద్యోగానికి వెళ్లి నిరుద్యోగులు.. అధికారుల రిఫ్లై విని షాక్!

నిరుద్యోగుల అమాయకత్వాన్నీ టార్గెట్‌గా కేటుగాళ్లు వల విసురుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలనే నిరుద్యోగుల అవసరాన్ని మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. నమ్మిన నిరుద్యోగులను కేటుగాళ్లు నట్టేట ముంచుతున్నారు. లక్షల్లో డబ్బులు వసూలు చేసి సైలెంట్‌గా సైడ్ అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 60 మంది అమాయకులకు టోకరా వేశాడు ఓ కేటుగాడు.

అపాయింట్‌మెంట్ లెటర్‌తో ఉద్యోగానికి వెళ్లి నిరుద్యోగులు.. అధికారుల రిఫ్లై విని షాక్!
Job Fraud

Edited By:

Updated on: Mar 22, 2026 | 1:01 PM

నిరుద్యోగుల అమాయకత్వాన్నీ టార్గెట్‌గా కేటుగాళ్లు వల విసురుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలనే నిరుద్యోగుల అవసరాన్ని మోసగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. నమ్మిన నిరుద్యోగులను కేటుగాళ్లు నట్టేట ముంచుతున్నారు. లక్షల్లో డబ్బులు వసూలు చేసి సైలెంట్‌గా సైడ్ అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 60 మంది అమాయకులకు టోకరా వేశాడు ఓ కేటుగాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం రెడ్డిగూడెం గ్రామానికి చెందిన దుగ్యాల రఘురాం హైదరాబాద్‌లో ఉంటూ పలువురు అధికారులు, రాజకీయ నేతలతో పరిచయాలు ఉన్నట్లు ప్రచారం చేసుకున్నాడు. హైదరాబాద్ డీఎంఈ (డిపార్ట్మెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్)లో సూపరిండెంట్‌గా పనిచేస్తున్న వాణితో రఘురాంకు పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఈజీ మనీ కోసం పథకం వేశారు. ఇందులో భాగంగా డీఎంఈ అధికారులు తనకు సన్నిహితమంటూ సూర్యాపేట ప్రాంతంలో రఘురాం స్నేహితులకు చెబుతుండేవాడు. స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ స్థానికంగా చెప్పేవాడు.

ఈ నేపథ్యంలో తుంగతుర్తికి చెందిన నాగమణి స్టాఫ్ నర్స్ గా పని చేస్తోంది. హైదరాబాద్ నుండి సూర్యాపేటకు బదిలీ చేయించాలని రఘురాంను కోరింది. అయితే ఓకే అంటూ ఆమె నుండి 20 లక్షల రూపాయలు వసూలు చేశాడు. మూడేళ్లు అయినా బదిలీ మాత్రం కాలేదు. ఈ క్రమంలో 2024 జూన్ లో స్టాఫ్ నర్సు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అదే సమయంలో నాగమణి గతంలో పనిచేసిన నర్సింగ్ కాలేజీకి చెందిన కొందరిని రఘురామ్ కు పరిచయం చేసింది. ఇంకేముంది హైదరాబాద్ డీఎంఈలో సూపరిండెంట్ గా పని చేస్తున్న వాణితో కలిసి స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రఘురాం వారిని నమ్మించాడు. నకిలీ నియామక పత్రాలను చూపి ఒక్కోక్కరి నుంచి రూ.3లక్షల నుంచి రూ. 5 లక్షలు వసూలు చేశాడు. డబ్బులు ఇచ్చిన వారి పేర్లు మెరిట్ లిస్టులో వచ్చే విధంగా చేసి, కౌన్సెలింగ్ కు పిలిపించి ఉద్యోగం వచ్చేలా చేస్తానంటూ మాయమాటలతో బురిడీ కొట్టించారు.

అయితే ఇటీవల వచ్చిన స్టాఫ్ నర్స్ ఫలితాల్లో ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు రాఘురాంను నిలదీశారు. తాము ఇచ్చిన డబ్బులను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో బాధితురాలు నాగమణితోపాటు పలువురు బాధితులు సూర్యాపేట పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో స్టాఫ్ నర్సులుగా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 60 మంది నిరుద్యోగుల నుంచి రూ. 1.85 కోట్లు రఘురాం వసూలు చేసిన కేటుగాడిని అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. బాధితుల్లో ఎక్కువ శాతం జీఎన్ఎ ఎం పూర్తి చేసిన విద్యార్థినులే ఉన్నారని తెలిపారు. నిరుద్యోగుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లను నమ్మవద్దని పోలీసులు నిరుద్యోగులకు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us