Warangal: ఊహించని వివాదంలో అఘోరీ.. కేసు నమోదు చేసిన మమునూరు పోలీసులు.. ఎందుకంటే?

| Edited By: Balaraju Goud

Nov 25, 2024 | 12:47 PM

బెస్తం చెరువు స్మశాన వాటికలో విచిత్ర పూజలు నిర్వహించింది అఘోరీ. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అఘోరీ పూజలు జనాన్ని తీవ్ర భయాందోళన గురిచేశాయి.

Warangal: ఊహించని వివాదంలో అఘోరీ.. కేసు నమోదు చేసిన మమునూరు పోలీసులు.. ఎందుకంటే?
Aghori Naga Sadhu
Follow us on

గత కొద్ది రోజుల నుండి విచిత్ర చేష్టలతో మీడియా.. సామాజిక మాధ్యమాల్లో ప్రజల మధ్య చర్చగా మారిన నాగసాధు అఘోరీ ఊహించని చిక్కుల్లో చిక్కుకుంది.. ఆమెపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మాముననూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంతకీ ఆ కేసు ఏంటో తెలుసా..? కోడిని చంపిన కేసు..! వింటుంటే విచిత్రంగా ఉంది కాదు.. కానీ అసలు కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

అవును అఘోరీపై ఊహించని చిక్కుల్లో చిక్కుకుంది.. మామునూరు పోలీస్ స్టేషన్లో కోడిని చంపిన కేసు నమోదైంది. 325 BNS 11(1)(A) PCCA సెక్షన్లలో పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనికి కారణం నవంబర్ 19వ తేదీన అఘోరీ వరంగల్ నగర శివారులోని బెస్తం చెరువు స్మశాన వాటికలో రెండు రోజులపాటు విడిది చేసింది. అక్కడ స్మశాన వాటికలో విచిత్ర పూజలు నిర్వహించిన అఘోరీ బహిరంగంగా కోడిని బలి ఇచ్చింది.

కోడిని చంపుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. అఘోరీ పూజలు జనాన్ని తీవ్ర భయాందోళన గురిచేశాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లాకు చెందిన రోహన్ రెడ్డి అనే యువకుడు అఘోరీపై మామునూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బహిరంగంగా కోడిని బలిచ్చి రక్తార్పణ చేయడం నేరమని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అఘోరీపై కేసు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, బెస్థం చెరువు స్మశాన వాటికలో రెండురోజుల పాటు విడిదిచేసి హల్ చల్ చేసిన అఘోరీ ప్రస్తుతం ఎక్కడ ఉందో ఇంకా పోలీసులు గుర్తించలేదు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..