Ganja plants: సర్కార్ దవాఖానలో గంజాయి మొక్కల కలకలం.. తలలు పట్టుకుంటోన్న అధికారులు

|

Aug 17, 2021 | 5:25 PM

ప్రభుత్వ దవాఖానలో గంజాయి మొక్కలు కలకలం రేపాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో గంజాయి మొక్కలు అందర్నీ ఆశ్చర్య చికితుల్ని చేశాయి.

Ganja plants: సర్కార్ దవాఖానలో గంజాయి మొక్కల కలకలం.. తలలు పట్టుకుంటోన్న అధికారులు
Ganja
Follow us on

Bhuvanagiri government hospital: ప్రభుత్వ దవాఖానలో గంజాయి మొక్కలు కలకలం రేపాయి. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో గంజాయి మొక్కలు అందర్నీ ఆశ్చర్య చికితుల్ని చేశాయి. ఆస్పత్రిలోని మార్చురీకి సమీపంలో ఏపుగా పెరిగిన నాలుగు గంజాయి మొక్కలను ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సిబ్బందికి సమాచారం అందించారు. ఆ సమాచారంతో ఆబ్కారీ పోలీసులు రంగంలోకి దిగి మొక్కలను పరిశీలించి.. ఇవి గంజాయి మొక్కలే అని నిర్ధారించి. అనంతరం వాటిని దహనం చేశారు.

అయితే, ఆస్పత్రి ఆవరణలో అసలు గంజాయి మొక్కలు ఎలా వచ్చాయి.. గంజాయి మొక్కలు కావాలనే పెంచుతున్నారా, అసలు ఇక్కడికి విత్తనపు గింజలు ఎలా వచ్చాయి, లేక ఎవరైనా గంజాయి అలవాటు ఉన్న వాళ్ళు ఎవరికీ అనుమానం రాకుండా ఆస్పత్రి ఆవరణలో గంజాయి మొక్కలు పెంచుతున్నారా అనే అనే కోణంలో ఆబ్కారీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంతకాలంగా మొక్కలు అక్కడే ఉన్నా అవి ఎవరి దృష్టికీ రాకపోవడం, ఉన్నవి గంజాయి మొక్కలని ఇప్పుడు తెలిసి రావడం స్థానికుల్ని అబ్బురపర్చింది. భువనగిరి పట్టణంలో నడిబొడ్డున గంజాయి మొక్కలు ఎలా పెరిగాయి? ఇంతగా పెరిగే వరకు ఎవరు చూడకుండా ఉన్నారా..? లేక తెలిసినా కొందరు చెప్పకుండా ఉన్నారా అనే సందేహాలను సైతం స్థానికులు వ్యక్తం చేస్తున్నారు.

Read also: వాగులో చిక్కుకున్న భార్యను చాకచక్యంగా కాపాడిన భర్త.. ఆదిలాబాద్ జిల్లాలో సినీ ఫక్కీ దృశ్యాలు