రూ. 150 కొట్టు మేకను పట్టు.. మందు, కోళ్లు, బీర్లు కూడా.. దసరా బంపర్ ఆఫర్, ఎక్కడంటే..?

తెలంగాణ ప్రజలకు దసరా పెద్ద పండుగ. బతుకమ్మ సంబరాలతో ఊర్లలో తొమ్మిది రోజులపాటు సందడి వాతావరణం ఉంటుంది. ఇక దసరా పండుగ వేళ తెలంగాణలోని ప్రతి ఇంటా ఉండే మందు, విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనం సైతం పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతారు.

రూ. 150 కొట్టు మేకను పట్టు.. మందు, కోళ్లు, బీర్లు కూడా.. దసరా బంపర్ ఆఫర్, ఎక్కడంటే..?
Dasara Bumper Offer

Edited By: Balaraju Goud

Updated on: Sep 21, 2025 | 7:18 PM

తెలంగాణ ప్రజలకు దసరా పెద్ద పండుగ. బతుకమ్మ సంబరాలతో ఊర్లలో తొమ్మిది రోజులపాటు సందడి వాతావరణం ఉంటుంది. ఇక దసరా పండుగ వేళ తెలంగాణలోని ప్రతి ఇంటా ఉండే మందు, విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనం సైతం పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు ఉత్సాహం చూపుతారు. అయితే ఇలాంటి దసరా పండుగ సందర్భంగా తెలంగాణలోని ఓ గ్రామంలో వినూత్నంగా ‘‘దసరా బంపర్ ఆఫర్’’ పేరుతో ఓ స్కీమ్‌ను తీసుకొచ్చారు. ఈ బంఫర్ ఆఫర్‌లో గెలుపొందిన వారికి మేక, మందు, బీర్లు, కోళ్లను అందించనున్నట్టుగా నిర్వహకులు తెలిపారు.

మీరు 150 రూపాయల కూపన్ కొనుగోలు చేయండి. ఈ లక్కీ డ్రా లో గెలిస్తే.. మేక లేదంటే బీర్ బ్యాటల్స్ పెట్టె ఇంకా.. ఇంకా.. బహుమతులు ఉన్నాయి.. బంపర్ ఆఫర్ ప్రకటించారు గ్రామస్తులు. దీంతో నాన్ వెజ్ ప్రియులతోపాటు మందు బాబులు ఈ కూపన్స్ కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి లక్కీ స్కిమ్‌లు మొదటిసారి చూస్తున్నామని అంటున్నారు స్థానికులు.

జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లో దసరా ఉత్సవాలు ఉత్సాహం కాస్త వింతగా మారింది. కొందరు నిర్వాహకులు లక్కీ డ్రా పేరుతో ఆశ్చర్యకరమైన ఆఫర్లు ప్రకటించారు. రూ.150 చెల్లించి కూపన్ కొనుగోలు చేస్తే, బహుమతులు గెలిచే అవకాశం ఉందని ప్రకటించారు. మొదటి బహుమతిగా మేక, రెండో బహుమతిగా బీర్ కాటన్, మూడో బహుమతిగా ఒక మద్యం ఫుల్ బాటిల్, నాలుగవ బహుమతిగా నాటుకోడి, ఐదో బహుమతిగా చీర అందిస్తామని తెలిపారు. ఇవన్నీ వింటే, మీరు కూడా ఆశ్చర్యపోతారు కదా! కానీ ఉత్సవాల ఉత్సాహంలో ముఖ్యమైనది. అందరితో సంతోషంగా, ఆహ్లాదంగా ఉత్సవాలను గడపడం.

వీడియో చూడండి..

ఇది చిన్న లక్కీ డ్రా, కానీ పెద్దగా హాస్యం, ఆనందం పంచే అవకాశం. దీంతో చాలా మంది ఈ కూపన్స్ కొనుగోలు చేస్తున్నారు. దసరా పండుగకు ముందు ఈ డ్రా ఓపెన్ చేయనున్నారు. దసరా పండుగ వేళ ఫ్రెండ్లీగా.. సరదాగా ఉంటుందనే ఆలోచనతో ఈ స్కీమ్ తీసుకొచ్చామని నిర్వాహకులు అంటున్నారు. అయితే ఈ స్కిమ్ వింతగా ఉండటంతో స్థానికులు షాక్ అవుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..