Yadadri Bhuvanagiri: యాదగిరిగుట్టలో ఘోర విషాదం.. కుప్పకూలిన రెండంతస్తుల భవనం..!
Yadadri Bhuvanagiri: యాదగిరిగుట్టలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రెండంతస్తుల భవనం కుప్పకూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Yadadri Bhuvanagiri: యాదగిరిగుట్టలో ఘోర విషాదం చోటు చేసుకుంది. రెండంతస్తుల భవనం కుప్పకూలి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాలక్షేపానికి వస్తే ప్రాణాలే పోయాయి. యాదగిరిగుట్టలో రెండంతస్తుల భవనం ఒక్కసారిగా కూలింది. ఘటనలో నలుగురు ప్రాణాలు విడిచారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. యాదాద్రి ప్రధాన రహదారి పక్కనే ఉన్న శ్రీరాం నగర్‌లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో బిల్డింగ్ యజమాని గుండ్లపల్లి దశరథతో పాటు శ్రీనివాస్ అలియాస్ చపాతి శ్రీను, ఉపేందర్, శ్రీనాథ్ మృతి చెందారు. కూలిన శిథిలాలలో నుంచి ఇద్దరిని బయటకు తీయగా.. ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. మరో వ్యక్తి కాలు విరిగిపోయింది. గాయపడిన వారిని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
చనిపోయిన నలుగురూ సాయంత్రం సమయంలో కాలక్షేపం కోసం ఈ భవనం వద్దకు వచ్చారు. ఎప్పట్లాగే టీ తాగుతూ మాట్లాడుతుండగా.. బాల్కనీ ఒక్కసారిగా కూలింది. పెద్ద సిమెంట్ స్లాబ్ మీద పడటంతో తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. రెండస్థుల భవనం 40 ఏళ్ల క్రితం నిర్మించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంటి ముందు నిబంధనలకు విరుద్ధంగా బాల్కనీ నిర్మించడమే ఘటనకు కారణంగా తెలుస్తుంది. ప్రమాద సమయంలో ఇళ్లలో, దుకాణాల్లో ఉన్న వారితో పాటు అక్కడికి వచ్చిన పలువురు గాయపడ్డారు. భవనం కుప్పకూదలిన ఘటనపై గవర్నర్ డా.తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యం అందించాలనిఅధికారులను ఆదేశించారు గవర్నర్ తమిళసై.
Also read:
Breast Cancer in Men: పురుషుల్లోనూ రొమ్ము క్యాన్సర్.. ఈ లక్షణాలుంటే వెంటనే అలర్ట్ అవ్వండి..!
Viral Video: వీడ్కోలు సమయంలో బోరున విలపించిన వరుడు.. కారణమేంటో తెలిస్తే షాక్ అవుతారు..!
Healthy Oats: త్వరగా బరువు తగ్గాలని భావిస్తున్నారా?.. ఓట్స్‌ని ఈ 4 విధాల్లో తీసుకోండి..