RS Praveen: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కి కరోనా పాజిటివ్.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స

|

Aug 10, 2021 | 3:21 PM

RS Praveen Kumar IPS: మాజీ ఐపీఎస్‌ అధికారి, ఇటీవల బీఎస్పీలో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ కరోనా బారిన పడ్డారు.

RS Praveen: ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌కి కరోనా పాజిటివ్.. గాంధీ ఆసుపత్రిలో చికిత్స
Rs Praveen Kumar
Follow us on

మాజీ ఐపీఎస్‌ అధికారి, ఇటీవల బీఎస్పీలో చేరిన ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ కరోనా బారిన పడ్డారు. ఆయన అనారోగ్యానికి గురికావడంతో వైద్య పరీక్షలు చేయించుకున్న ఆయనకు కోవిడ్ వైరస్‌ సోకినట్లు తేలింది. ఆయన నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.“గత రెండురోజులుగా నీరసంగా ఉంటే Covid టెస్టు చేయించుకుని, Positive గా నిర్దారణ అయిన వెంటనే ప్రభుత్వ గాంధీ హాస్పిటల్ కు వచ్చి చికిత్స చేయించుకుని ఇప్పుడే డిశ్చార్జి అయ్యాను. నాతో అతి దగ్గరగా తిరిగిన వ్యక్తులూ ఐసోలేషన్‌లోకి వెళ్లాలి” అంటూ ట్వీట్ చేశారు.


పరీక్షించిన వైద్యులు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నందున సలహాలు తీసుకొని ఇంటికి వెళ్లారు. ఈ నెల 8న నల్గొండలో నిర్వహించిన రాజ్యాధికార సంకల్ప సభలో పాల్గొన్న ప్రవీణ్‌కుమార్‌, బీఎస్పీలో చేరిన విషయం తెలిసిందే. కాగా, గత కొద్దిరోజులుగా ఆయనతో సన్నితంగా ఉన్నవారిని కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు.