AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahabubnagar MLC Results: సంచలనం.. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఘన విజయం..

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల MLC ఉపఎన్నికలో BRS గెలుపొందింది.. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై.. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. 111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి గెలుపొందారు. ఈ గెలుపుతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది..

Mahabubnagar MLC Results: సంచలనం.. మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నికలో కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ ఘన విజయం..
Mahabubnagar Mlc Results
Shaik Madar Saheb
|

Updated on: Jun 02, 2024 | 10:34 AM

Share

మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల MLC ఉపఎన్నికలో BRS గెలుపొందింది.. కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై.. బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. 111 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్‌కుమార్ రెడ్డి గెలుపొందారు. ఈ గెలుపుతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది.. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం వెలువడింది.. బీఆర్ఎస్‌కు -763, కాంగ్రెస్‌కు -652 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థికి ఒక ఓటు పోలయింది..  1437 ఓట్లలో 21చెల్లని ఓట్లుగా నిర్ధారించారు. పోలింగ్ జరిగిన రెండు నెలల తర్వాత ఇవాళ కౌంటింగ్ జరిగింది.

మార్చి 28న ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పది పోలింగ్ కేంద్రాలలో ఎన్నికను నిర్వహించారు. మొత్తం 1,439 మంది స్థానిక సంస్థల ఓటర్లుండగా… అందులో 1,437 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 99.86 శాతం పోలింగ్ నమోదైంది. నువ్వా నేనా అన్నట్లు సాగిన ఎన్నిక ఫలితం ఏప్రిల్ 2వ తేదీనే రావాల్సి ఉంది.. అయితే.. ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉన్న చివరి నిమిషంలో వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఈ ఫలితాల ప్రభావం వాటిపై పడే అవకాశం ఉందని కౌంటింగ్ ను జూన్ 2వ తేదీకి మార్చారు.