KTR: దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం.. అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం.. రేపు బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’..

|

Dec 22, 2023 | 6:22 PM

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. ఎన్నికల తర్వాత తొలిసారిగా జరిగిన సమావేశాల్లో.. ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షం తగ్గేదేలేదంటూ బరిలోకి దిగడంతో.. మాటల తూటాలు హీట్ పుట్టించాయి. 6 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 26 గంటల 33 నిమిషాల పాటు చర్చ జరిగింది.

KTR: దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం.. అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం.. రేపు బీఆర్ఎస్ ‘స్వేద పత్రం’..
KTR
Follow us on

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా కొనసాగాయి. ఎన్నికల తర్వాత తొలిసారిగా జరిగిన సమావేశాల్లో.. ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షం తగ్గేదేలేదంటూ బరిలోకి దిగడంతో.. మాటల తూటాలు హీట్ పుట్టించాయి. 6 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 26 గంటల 33 నిమిషాల పాటు చర్చ జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, విద్యుత్‌ రంగంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. అయితే శ్వేతపత్రాల అంశంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య సభలో మాటల యుద్ధమే కొనసాగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ గత పదేళ్ల పాలన, అప్పులపై శాసనసభలో శ్వేతపత్రాలు విడుదల చేసింది. అంతా తప్పుల తడకగా శ్వేతపత్రం ఉందని.. వాస్తవాలు దాచిపెట్టారంటూ బీఆర్ఎస్ మండిపడింది. తాము పదేళ్లలో సంపాదించిన ప్రగతి ఇదేనంటూ బీఆర్‌ఎస్‌ కూడా డాక్యుమెంట్‌ని రిలీజ్‌ చేసింది. ఈ తరుణంలో మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో కీలక విషయాన్ని పంచుకున్నారు. తెలంగాణ భవన్ వేదికగా 23వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు “ స్వేద పత్రం” పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అంటూ వివరించారు.

కేటీఆర్ ఏం రాశారంటే.. ‘‘తొమ్మిదిన్నరేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం.. పగలూ రాత్రి తేడా లేకుండా.. రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన.. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించం.. విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం..అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం.. అందుకే గణాంకాలతో సహా.. వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు.. అప్పులు కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపదను ఆవిష్కరించేందుకు.. తెలంగాణ భవన్ వేదికగా 23వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు “ స్వేద పత్రం ” పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ’’ జరుగుతుందంటూ ఎక్స్ లో మాజీ మంత్రి షేర్ చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..