Telangana: ఇక్కడ తిరిగి నీ సమయాన్ని వృధా చేసుకోకు.. వైఎస్ షర్మిలకు కడియం శ్రీహరి సలహా..

|

Feb 07, 2023 | 6:10 PM

వైఎస్ షర్మిలపై మండిపడ్డారు మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి. సమైక్యాంధ్ర కోసం ఊరూరా తిరిగిన షర్మిలకు తెలంగాణలో రాజకీయం చేసే నైతికత హక్కు ఉందా.. అని ప్రశ్నించారు. షర్మిలను చూస్తుంటే జాలేస్తోందన్న కడియం ఇప్పటికైనా ఏపీకి వెళ్లి రాజకీయాలు చేసుకోవాలని సూచించారు..

Telangana: ఇక్కడ తిరిగి నీ సమయాన్ని వృధా చేసుకోకు.. వైఎస్ షర్మిలకు కడియం శ్రీహరి సలహా..
Kadiyam Srihari On Ys Sharmila
Follow us on

తెలంగాణ బడ్జెట్‌పై షర్మిల చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. ముందు నుంచి తెలంగాణకు వైఎస్ కుటుంబం వ్యతిరేకమని అన్నారు. జగన్ జైలు కెళ్లినప్పుడు విజయలక్ష్మి, షర్మిల పాదయాత్రలు చేపట్టి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. షర్మిల, విజయలక్ష్మిని రాజకీయంగా జగన్ అన్యాయం చేశారని అన్నారు. ఈ విషయాలపై ఆంధ్రకు వెళ్లి ప్రజలకు మొర పెట్టుకోవాలని సూచించారు. రెపో మాపో జగన్ జైలుకు పోతే ఆమెకు అవకాశం వస్తుందని అన్నారు. ఇక్కడ తిరిగి సమయం వృధా చేసుకోవద్దని షర్మిలకు కడియం శ్రీహరి సూచించారు.

“జగన్ వీళ్ళను రాజకీయంగా అన్యాయం చేశారు. షర్మిల ఆంధ్రకు వెళ్లి అక్కడి ప్రజలకు మొర పెట్టుకో.. రేపో మాపో జగన్ జైలుకు పోతే నీకు అవకాశం వస్తుంది. ఇక్కడ తిరిగి నీ సమయాన్ని వృధా చేసుకోకు” అంటూ కడియం సలహా ఇచ్చారు.

ఇదిలావుంటే, తెలంగాణలో సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కొత్త సీసాలో పాత సార పోసినట్లుగా బడ్జెట్ఉందంటూ ఎద్దేవా చేశారు. ఆర్ధిక మంత్రి హరీష్ రావు కొత్త సీసా తీసుకొని ఫామ్‌హౌజ్‌కి వెళ్లారని.. అందులో కేసీఆర్ పాత సార పోశారంటూ సెటైర్లు సంధించారు. బడ్జెట్‌లో కొత్తగా ఏమీ లేదని విమర్శించారు. గత ఏడాది బడ్జెట్‌నే ఈ ఏడాది కాపీ పేస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. గత బడ్జెట్ కేటాయింపులు మాదిరిగా ఈ సారి కూడా అంకెలు చూపించారని షర్మిల విమర్శించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం