ప్రజల తీర్పును గౌరవిద్దాం.. రాజ్యాంగ బద్దంగా జనవరి 16 వరకు మన ప్రభుత్వం కొనసాగే అవకాశం ఉండే.. కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నాం.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏమి జరుగుతుందో వేచి చూద్దాం.. అంటూ కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సూచించారు. త్వరలో తెలంగాణ భవన్లో పార్టీ సమావేశం నిర్వహిస్తామని.. అప్పుడు శాసనసభాపక్ష నేతను ఎన్నుకుందామంటూ పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి పలువురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు సోమవారం వెళ్లి సీఎం కేసీఆర్ ను కలిశారు. తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి కేసీఆర్.. ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలపై సమీక్ష జరిపిన కేసీఆర్.. గెలుపొందిన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా మాట్లాడారు.
ముందుగా బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో భేటీ అయ్యారు. అక్కడ నుంచి నేరుగా కేసీఆర్ ఫామ్‌హౌస్‌కి వెళ్లి కేసీఆర్ ను కలిశారు. ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్ ను కలిసిన వారిలో హరీష్‌రావు, పట్నం మహేందర్‌రెడ్డి, పల్లా, గంగుల, తుల ఉమ, మల్లారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, తదితర నూతన ఎమ్మెల్యేలు ఉన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..