Telangana: వదిలిపెట్టనంటున్న కాంగ్రెస్‌ ఎంపీ.. మధురై కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కారణం ఇదే..

|

Jan 10, 2024 | 4:42 PM

తెలంగాణ రాజకీయాలు అప్పుడూ.. ఇప్పుడూ అని లేదు.. ఎప్పుడూ హీటు పుట్టిస్తూనే ఉంటాయి.. ఒక పార్టీ ఒకటంటే.. మరో పార్టీ రెండంటుంది.. ఇంతటితో ఆగకుండా .. ఒకదానికొకటి విమర్శల బాణాలతో దూసుకెళ్తునే ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల నాటినుంచి మొదలైన ఈ వేడి.. ఇప్పటికీ చల్లరడం లేదు.. అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య వాడీవేడి వాదనలు తెరపైకి వస్తున్నాయి.

Telangana: వదిలిపెట్టనంటున్న కాంగ్రెస్‌ ఎంపీ.. మధురై కోర్టుకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కారణం ఇదే..
BRS MLAs present in Madurai court
Follow us on

తెలంగాణ రాజకీయాలు అప్పుడూ.. ఇప్పుడూ అని లేదు.. ఎప్పుడూ హీటు పుట్టిస్తూనే ఉంటాయి.. ఒక పార్టీ ఒకటంటే.. మరో పార్టీ రెండంటుంది.. ఇంతటితో ఆగకుండా .. ఒకదానికొకటి విమర్శల బాణాలతో దూసుకెళ్తునే ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికల నాటినుంచి మొదలైన ఈ వేడి.. ఇప్పటికీ చల్లరడం లేదు.. అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య వాడీవేడి వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఇన్‌ఛార్జ్‌, ఎంపీ మాణిక్కం ఠాగూర్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో షేర్‌ చేసిన ఫోటోలు రాజకీయంగా మరింత వేడిరాజేశాయి. ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధురై కోర్టు ఆవరణలో కూర్చొని ఉన్న ఫొటోలను మాణిక్కం ఠాగూర్‌ షేర్ చేసి తనపై వచ్చిన ప్రతి ఆరోపణపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ స్పష్టంచేశారు.

మాణిక్కం ఠాగూర్‌ వేసిన పరువునష్టం దావా కేసులో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మధురై కోర్టుకు హాజరయ్యారు. వీరు కోర్టు ఆవరణలో కూర్చున్న ఫోటోలను ‘ఎక్స్’ వేదికగా షేర్‌ చేసిన ఠాగూర్.. ”మాపై వచ్చిన ప్రతి ఆరోపణపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. వారు నాపై చేసిన తప్పుడు ఆరోపణలపై స్పందిస్తూ మధురై కోర్టులో పరువు నష్టం కేసు వేశాను. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి ఇద్దరూ మదురై కోర్టుకు హాజరుకాగా.. ధర్మాసనం వారిపై ఎన్‌బిడబ్ల్యూ (నాన్ బెయిలబుల్ వారంట్) జారీ చేసింది..” అంటూ ఎక్స్‌లో రాశారు.

ఇది సమయం మాత్రమే..

కాగా.. మాణిక్కం ఠాగూర్ ట్వీట్ కు పాడి కౌశిక్ రెడ్డి రీట్విట్ చేశారు. ‘‘మాణిక్కం ఠాగూర్ జీ.. ఈ ఆరోపణలు సొం స్వంత కాంగ్రెస్ పార్టీ నేతలు చేసారు.. మేము దానిని సమర్థించాము.. అయితే న్యాయం గెలుస్తుందని చింతించకండి.! ఇది సమయం మాత్రమే.’’ అంటూ రాశారు.

మాణిక్కం ఠాగూర్.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉన్న సమయంలో టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలు మాణిక్కం ఠాగూర్‌పై పలు ఆరోపణలు చేశారు. ఐదు వందల కోట్లు తీసుకుని రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ గా నియమించారంటూ ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఖండించిన ఠాగూర్‌.. ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై మధురై కోర్టులో పరువు నష్టం దావా పిటిషన్ దాఖలు చేశారు. అయితే, కోర్టు వీరిని విచారణకు హాజరు కావాలని గతంలో సమన్లు జారీ చేసినప్పటికీ.. పట్టించుకోకపోవంతో నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..