
BRS vs MIM – Bodhan Politics: బోధన్‌లో రాజకీయం ఢీ అంటే ఢీ అంటోంది. బోధన్‌లో అసుద్దీన్ వర్సెస్ ఎమ్మెల్యే షకీల్ కాంట్రవర్సీ కాకరేపుతోంది. MIM కౌన్సిలర్ల విషయంలో రాజుకున్న వివాదం MIM – BRS ల మధ్య భగ్గుమంటోంది. నిజామాబాద్‌లో పోటీపై త్వరలోనే స్పష్టత ఇస్తామని అసద్ తేల్చి చెపితే.. దమ్ముంటే బోధన్‌లో తనపై పోటీచేయాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్ సవాల్ విసురుతున్నారు. అర్థరాత్రి హఠాత్తుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసిన బోధన్ BRS ఎమ్మెల్యే షకీల్ ఇలా అసద్‌ను టార్గెట్ చేయడం చర్చనీయాంశమైంది. అసదుద్దీన్ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారనీ.. తనపై హత్యాయత్నం చేసిన కౌన్సిలర్లపై పీడీ యాక్టు పెట్టాలనీ డిమాండ్ చేశారు. దమ్ముంటే అసదుద్దీన్ తనపై పోటీచేయాలంటూ బోధన్ ఎమ్మెల్యే షకీల్ సవాల్ విసిరారు. అనవసరమైన రాజకీయాలు చేయొద్దంటూ సూచించారు. యుద్ధం వెనకనుంచి కాదు,, ఎదురుగా చేయాలంటూ షకీల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే తనపై పోటీచేయాలంటూ అసద్‌కి సవాల్ విసిరిన షకీల్.. తుపాకీ తూటాలకు సిద్ధంగా ఉన్నానని, అవసరమైతే తల్వార్‌లు సైతం తెచ్చుకోండంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
ఇద్దరి మధ్య ఈ స్థాయిలో గొడవకు ఇటీవల ఇద్దరు MIM కౌన్సిలర్ల అరెస్టే కారణం. ఇటీవల పట్టణ ప్రగతిలో భాగంగా వార్డుల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే షకీల్‌ను.. ఇద్దరు కౌన్సిలర్లు నిలదీశారు. తమ వార్డుల్లో అభివృద్ధి జరగడం లేదని.. వివక్ష చూపుతున్నారంటూ అసద్ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బోధన్‌లోనూ MIM పోటీ చేస్తుందని స్పష్టంచేశారు. అయితే, ఈ సందర్భంగా ఉద్రిక్తత తలెత్తింది. తర్వాత కౌన్సెలర్లపై హత్యాయత్నంతో పాటు మరో మూడు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వారు ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు.
అయితే, అసదుద్దీన్ ఒవైసీ ఇటీవల జైల్లో ఉన్న ఆ MIM కౌన్సిలర్లను కలిసి రావడంతో వివాదం చినికి చినికి గాలివానగా మారింది. మరోవైపు తాజాగా, తమ కొడుకులను బోధన్ ఎమ్మెల్యే అన్యాయంగా జైల్లో పెట్టించారంటూ MIM కౌన్సిలర్లు తండ్రి అబ్దుల్ బాకీ మసీదులో ఖురాన్ ప్రమాణం నేపథ్యంలో బోధన్‌లో రాజకీయం ప్రకంపనలు రేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..