
సిద్దిపేట, ఫిబ్రవరి 5: మున్సిపల్ ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, సరికొత్త పంథాలో దూసుకుపోతున్నారు. కేవలం నమస్కారాలకు పరిమితం కాకుండా.. వినూత్న ప్రచారాలతో ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. మైకులు పెట్టి అరిచే కాలం పోయింది. ఇప్పుడు అంతా పర్సనల్ టచ్. అభ్యర్థులు ఓటర్లలో ఒకరిగా కలిసిపోతు ప్రచారం చేస్తున్నారు.
ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలక ఎన్నికల ప్రచారంలో జరిగింది. దుబ్బాక మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డ్ బీఆర్ఎస్ అభ్యర్థి అంకం హేమలత కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలంటూ వినూత్నంగా ప్రచారం చేసింది. 18వ వార్డులో తిరుగుతూ..బీడీలు చుట్టే కార్ఖానాలకు వెళ్లి అక్కడ ఉన్న మహిళలతో బీడీలు చుడుతూ.. ఓట్లు అడిగారు. మరో ఇంట్లోకి వెళ్లి మహిళ నెత్తి దువ్వి జడలు వేశారు. ఇలా చేస్తూ తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఏదేమైనా ఫిబ్రవరి 11న జరగనున్న ఈ సమరంలో అభ్యర్థుల వినూత్న ప్రయోగాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.