తెలంగాణను కాపాడేందుకే బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు.. కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ప్రెస్‌మీట్..
సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ పొత్తు ఖారారైంది.. కలిసి పోటీచేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. మంగళవారం బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో బీఎస్పీ పొత్తు ఖారారైంది.. కలిసి పోటీచేయాలని రెండు పార్టీలు నిర్ణయించాయి. మంగళవారం బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని నందినగర్ లోని నివాసంలో కేసీఆర్‌ను ప్రవీణ్ కుమార్ కలిసి తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. అనంతరం బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు ఉంటుందని ప్రకటించారు. తెలంగాణను కాపాడేందుకే పొత్తు పెట్టుకున్నట్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. మాయావతితో మాట్లాడిన తర్వాతనే పొత్తు ప్రతిపాదన పెట్టానన్నారు. పొత్తు విదివిధానాలపై చర్చించామని.. త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలు తమను ఆశీర్వదిస్తారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. 4 నెలలు కాకముందే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని తెలిపారు.
కేసీఆర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. కొన్ని సీట్లను బీఎస్పీకి కేటాయిస్తామని తెలిపారు. సీట్ల విషయాలు, తదితర అంశాలపై రేపు మాయావతితో మాట్లాడతానని కేసీఆర్ తెలిపారు.
ఈ సమావేశంలో హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, బాల్క సుమాన్‌తో పాటు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
