Telangana: సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తోందని చెల్లిని చంపిన అన్న.. రోకలిబండతో కొట్టి..

|

Jul 26, 2023 | 12:11 PM

Brother kills his sister : అన్నాచెల్లెల అనుబంధం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే.. ఎందుకంటే.. అన్నంటే చెల్లికి ప్రాణం.. చెల్లెంటే అన్నకు ప్రాణం అనేలా.. ఆప్యాయత.. ప్రేమ, బాధ్యతతో ఇలా కలాకాలం అదే అనుబంధంతో ఉంటారు..

Telangana: సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తోందని చెల్లిని చంపిన అన్న.. రోకలిబండతో కొట్టి..
Crime News
Follow us on

Brother kills his sister : అన్నాచెల్లెల అనుబంధం గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే.. ఎందుకంటే.. అన్నంటే చెల్లికి ప్రాణం.. చెల్లెంటే అన్నకు ప్రాణం అనేలా.. ఆప్యాయత.. ప్రేమ, బాధ్యతతో ఇలా కలాకాలం అదే అనుబంధంతో ఉంటారు.. అయితే.. ఓ అన్న తాజాగా దారుణానికి పాల్పడ్డాడు.. చెల్లి సోషల్‌ మీడియాలో రీల్స్‌ చేస్తుందని ఆగ్రహంతో రగిలిపోయాడు.. ఇంట్లో ఉన్న రోకలి బండతో ఆమెను కొట్టి చంపాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం రాజీవ్ నగర్‌ లో చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో రీల్స్ పెడుతుందని అన్న సొంత చెల్లిని రోకలి బండతో కొట్టి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఇల్లందు మండలం రాజీవ్ నగర్‌కు చెందిన అజ్మీర సింధు.. మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అయితే, ఆమె ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఈక్రమంలో సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేస్తోంది. అయితే, ఇది అన్న హ‌రిలాల్ ఇష్టం లేదు.. అతను చాలాసార్లు ఇదే విషయంపై పలు మార్లు హెచ్చరించాడు. క

ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్‌ పై హరిలాల్‌.. చెల్లి సింధుతో గొడవ పెట్టుకున్నాడు. ఎంత వద్దని చెప్పిన వినట్లేదన్న కోపంతో హరిలాల్ రోకలి బండతో సింధు తలపై కొట్టాడు. దీంతో ఆమె మరణించింది. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. క్షణికావేశంలో అన్న చేసిన పనికి ఓ చెల్లి ప్రాణం బలైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..