IndiGo: హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఫ్లైట్‌కు థ్రెట్ మెయిల్.. బాంబు ఉందంటూ బెదిరింపు!

విమానాలకు వరుస బాంబు బెదరింపులకు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇండిగో విమానానికి మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. కువైట్ నుంచి హైదారాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఉదయం 8 గంటల 10 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో దిగాల్సిన వివమానాన్ని దారి మళ్లించారు అధికారులు.

IndiGo: హైదరాబాద్ వస్తున్న ఇండిగో ఫ్లైట్‌కు థ్రెట్ మెయిల్.. బాంబు ఉందంటూ బెదిరింపు!
Bomb Threat

Updated on: Dec 02, 2025 | 8:15 AM

ఈ మధ్య కాలంలో విమానాలు, ఎయిర్‌పోర్టులు, స్కూల్స్‌, హోటల్స్‌కు బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో వెలుగు చూసింది. కువైట్ నుంచి హైదారాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వస్తున్న ఇండిగో విమానికి ఒక గుర్తు తెలియని ఈ మెయిల్ నుంచి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

విమాన పైలట్‌తో పాటు శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఉదయం 8.10కి శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానాన్ని అధికారులు దారి మళ్లించారు. దీంతో ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు. అయితే ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ థ్రెట్ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు పంపారు అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.