Bomb threats: విమానాలకు మళ్లీ బాంబు బెదిరింపులు.. బెంబేలెత్తిన ప్రయాణికులు
ఇండియాలో కొద్ది రోజులుగా వరుస బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే..గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించారు.
గోవా నుండి కోల్‌కతా వెళుతున్న ఇండిగో విమానం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానానికి బాంబు బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు దారి మళ్లించి శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో 180 ప్రయాణికులు ఉన్నారు. వారికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరిపిల్చుకున్నారు. హైదరాబాద్ నుండి పూణే వెళ్ళాల్సిన ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపు రావడం సంచలనంగా మారింది. హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లాల్సిన మరో ఇండిగో విమానానికి కూడా బాంబు బెదిరింపు వచ్చింది. విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమైయ్యారు. అయితే ఇండియాలో కొద్ది రోజులుగా వరుస బాంబు బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే..గత 21 రోజుల్లో 510కిపైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది