Black magic: గుమ్మం ముందే పసుపుతో ముగ్గు…రెండు నిమ్మకాయలు.. ఏంటని చూస్తే గుండె ఆగినంత పనైంది..!

ఎక్కడైనా మనకు పసుపుతో ముగ్గు వేసి..రెండు నిమ్మకాయలు కనిపిస్తే గుండె ఆగినంత పని అవుతుంది. చేతబడి, క్షుద్ర పూజలు అంటే వెన్నులో వణుకు పుడుతుంది. తాజాగా మహబూబాబాద్ జిల్లాలో క్షుద్ర పూజల కలకలం రేపింది. దీపావళికి ఊరికి వెళ్లి వచ్చే సరికి నిమ్మకాయలు దర్శనమిచ్చాయి.

Black magic: గుమ్మం ముందే పసుపుతో ముగ్గు...రెండు నిమ్మకాయలు.. ఏంటని చూస్తే గుండె ఆగినంత పనైంది..!
Black Magic In Mahabubabad

Updated on: Nov 01, 2024 | 12:52 PM

మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. ఇంటికి తాళం వేసి దీపావళి పండుగకు కుటుంబ సభ్యులు ఊరికి వెళ్ళారు. ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ముత్యం క్షుద్ర పూజలు చేశారు. పసుపు ముగ్గు వేసి అందులో రెండు నిమ్మకాయలు పెట్టారు. రంజిత్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోనే క్షుద్రపూజలు చేసినట్లు కొందరు అనుమానిస్తున్నారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతన్నారు.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us